Virat Kohli Daughter:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా మైదానంలో ప్రాక్టీస్‌కు బ్రేక్ ఇచ్చి ఆర్సీబీ ఇన్సైడర్ మిస్టర్ నాగ్స్ (Mr. Nags) ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో తన కూతురు వామిక గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. తను ఇప్పుడే క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడుకుంటుందని విరాట్ అన్నాడు.
ఇక హోస్ట్, స్టాండప్ కమెడియన్ మిస్టర్ నాగ్స్ ఎప్పటిలాగే ఇంటర్వ్యూను తనదైన ఫన్నీ స్టైల్లో నడిపించాడు. 'నేను ఓ కామెంటేటర్‌గా కాకుండా కామన్ మ్యాన్‌గా ఉంటే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా?' అంటూ సరదాగా అడిగాడు. తర్వాత తాను రెండోసారి తండ్రైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ, కూతురు గురించి అడిగాడు. 'పాపు ఎలా ఉంది?' అని నాగ్స్ అడిగాడు. 'పాపు ఎవరు?' అని విరాట్ అడగ్గా, 'పాపు అంటే బేబీ' అని చెప్పాడు.
దీనికి విరాట్ 'పాప బాగుంది. అందరూ బాగున్నారు. నా కుతురైతే ఇప్పుడే బ్యాట్ అందుకొని అటు ఇటూ తిప్పుతూ ఆడుకుంటోంది. కానీ, భవిష్యత్‌లో ఏం అవ్వాలన్నది తన నిర్ణయమే' విరాట్ అన్నాడు. కాగా, ఇంటర్వ్యూలో నాగ్స్ ఫన్నీ సెటైర్ వేశాడు. విరాట్ కుమారుడు, కూతురిని ఉద్దేశించి, 'ఒకరు (అకాయ్ కోహ్లీ) ఐపీఎల్ కోసం, మరొకరు (వామిక) డబ్ల్యూపీఎల్ కోసం' అని అన్నాడు. దీంతో విరాట్ ఒక్కసారిగా నవ్వుకున్నాడు.