Team India Road Show:టీ20 వరల్డ్కప్ నెగ్గిన టీమ్ఇండియా 3 రోజుల తర్వాత గురువారం స్వదేశం చేరుకుంది. ఇక ఇవాళ ముంబయిలో భారీ రోడ్ షో ఉండనుంది. 'విక్టరీ పరేడ్' పేరుతో బీసీసీఐ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రోడ్ షో కోసం ఓ బస్సును బీసీసీఐ ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఓపెన్ టాప్ బస్సుపై టీమ్ఇండియా ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొననున్నారు. అయితే తాజాగా ఈ రోడ్ షోకు సంబంధించిన బస్సు రెడీ అయిపోయింది.
ర్యాలీకి వాడనున్న బస్సును అందంగా డిజైన్ చేశారు. టీమ్ఇండియా వరల్డ్కప్ అందుకున్న ఓ ఫొటో స్టిక్కర్ను బస్సుకు ఓ వైపున అతికించారు. ఈ ఫొటోలో టీమ్ఇండియా ప్లేయర్లతోపాటు, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంకా ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక 'ఛాంపియన్స్ 2024', బీసీసీఐ లోగోలు బస్సుపై ఉంచారు. కాగా, గురువారం సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ప్రారంభం కానుంది. ముంబయి నారిమన్ పాయింట్ వద్ద ర్యాలీ ప్రారంభమై వాంఖడే స్టేడియం వద్ద ముగస్తుంది. ర్యాలీ డిస్టెన్స్ దాదాపు 2కిలోమీటర్లు ఉండనుంది. ఈ రోడ్ షోకు భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.