Virat Kohli Heart Break:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2024 ఐపీఎల్లో టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గానూ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా విరాటే. గత 15ఏళ్లుగా కెరీర్లో అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతున్న విరాట్ అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు డొమెస్టిక్ టోర్నీల్లోనూ విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు అనేకం. అయితే కెరీర్ పరంగా ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని తాజాగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17లో బిజీగా ఉన్న విరాట్ జియో సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో 2016 ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో తన హార్ట్‌బ్రేక్ అయ్యిందంటూ చెప్పాడు.
'నా జీవితంలో 2016లో రెండుసార్లు గుండె బద్దలైంది. ఒకటి టీ20 వరల్డ్‌కప్ కాగా, మరొకటి అదే సంవత్సరం జరిగిన ఐపీఎల్ ఫైనల్. ఈ రెండింట్లో ఓటమి నన్ను ఎంతో కుంగదీశాయి. టీమ్ఇండియాకు ప్రపంచకప్ అందించగలను అని అనుకున్నా అది నెరవేరలేదు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది' అని విరాట్ అన్నాడు.