Team India Return:టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. వెస్టిండీస్‌లో హరికేన్ తుపాన్ కారణంగా భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోయింది. టీమ్‌ఇండియా ప్లేయర్లు ఉన్న బార్బడోస్‌తోపాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్ పాంత్రాల్లో తపాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో అక్కడి అధికారులు తుపాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు.
తూపాన్ దెబ్బకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బర్బడోస్లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో టీమ్ఇండియా ప్లేయర్లంతా తాము బస చేస్తున్న హోటల్లోనే ఉండిపోయారు. బార్బడోస్‌లో కర్ఫ్యూ దృష్ట్యా భారత క్రికెట్ జట్టు స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. టీమ్ఇండియాతోపాటు మ్యాచ్‌ల కవరేజ్‌కు వెళ్లిన మీడియా కూడా బర్బడోస్నే ఉంది.
గ్రాండ్ వెల్కమ్:అయితే టీమ్ఇండియాకు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. వాళ్లు స్వదేశానికి చేరుకున్నాక ఘనంగా సన్మానించాలని డిసైడైంది. ప్లేయర్లు అక్కడ నుంచి బయల్దేరిన తర్వాత ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పారు.
India Tour Of Zimbabwe 2024: మరో 4 రోజుల్లో టీమ్ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే జట్టులో ఎంపికైన యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్, రింకుసింగ్ కూడా బర్బడోస్లో చిక్కుకపోయారు. ఒకవేళ వీరి రాక ఆలస్యమైతే వాళ్ల స్థానాలను ఇతర ప్లేయర్లతో భర్తీ చేస్తారు. కాగా, ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.