Team India New Coach:టీమ్ఇండియా జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు. ఎంపికైన కొత్త కోచ్‌తోనే భారత్ ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా ఓ సందర్భంలో చెప్పారు. కానీ, కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారన్నదానిపై మాత్రం జై షా క్లారిటీ ఇవ్వలేదు. ఇక కొత్త సెలక్టర్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు షా తెలిపారు. అయితే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జట్టు కోచ్‌గా ఎంపిక కానున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అతడి ఇంటర్వ్యూ కూడా రీసెంట్గా పూర్తైంది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
'కోచ్, టీమ్ సెలక్టర్ ఎంపిక త్వరలోనే పూర్తవుతుంది. ఈ పదవులకు ఇద్దరి పేర్లు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేశాం. ముంబయి చేరుకున్నాక మరిన్ని వివరాలు బయటపెడతాం. టీమ్ఇండియా త్వరలో జింబాబ్వే టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ (టెంపరరీ)గా వెళ్లనున్నారు, ఇక శ్రీలంక పర్యటన నాటికి కొత్త కోచ్ జట్టుతో చేరతారు' అని షా సోమవారం పేర్కొన్నారు. కాగా, జూలై 27న శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో టీమ్ఇండియా ఆతిథ్య శ్రీలంకతో 3 టీ20, 3 వన్డేలు అడనుంది.
శ్రీలంక పర్యటన షెడ్యూల్
- తొలి టీ20- జూలై 27-
- రెండో టీ20- జూలై 28
- మూడో టీ20- జూలై 30
- తొలి వన్డే- ఆగస్టు 02
- రెండో వన్డే- ఆగస్టు 04
- మూడో వన్డే- ఆగస్టు- 07