తెలంగాణ

telangana

ETV Bharat / sports

సొంతగడ్డపై భారత్ డీలా- 'పుజారా' కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్​!

స్వదేశీ పిచ్​లపై టీమ్ఇండియా ఇబ్బందులు- టపటపా కూలుతున్న బ్యాటింగ్ ఆర్డర్- పూజారానే కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్!

IND VS NZ TEST 2024
IND VS NZ TEST 2024 (Source: Getty Images (Left), Associated Press (Right))

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

IND vs NZ 2nd Test 2024 :న్యూజిలాండ్​తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా వరుసగా బోల్తా కొడుతోంది. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలవ్వగా, పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్​లోనూ విఫలమైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్​లో 259 పరుగులకే ఆలౌట్ అవ్వగా, భారత్ 156రన్స్​కే చాపచుట్టేసింది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో టీమ్ఇండియా డిఫెండబుల్ బ్యాటర్​ ఛెతేశ్వర్​ పుజారాను జట్టులోకి తిరిగి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

'పుజారాను తీసుకోండి'
టీమ్ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కివీస్​తో జరుగుతున్న సిరీస్​లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రంజీల్లో అదరగొడుతున్న ఛెతేశ్వర్ పుజారాను జట్టులోకి తీసుకురావాలని సెలక్టర్లను కోరుతున్నారు. 'మాకు ఛెతేశ్వర్ పుజారా కావాలి. ఆసీస్ పిచ్​ల్లో వైట్ బాల్ స్పెషలిస్ట్ బ్యాటర్లు రాణించలేరు. రోహిత్ శర్మ సీమ్ పిచ్ లపై బ్యాటింగ్ సరిగ్గా చేయలేడు. సీనియర్లందర్నీ దేశీయ క్రికెట్ ఆడేలా చేయాలి' అని ఒక అభిమాని ఎక్స్​లో పోస్టు చేశాడు.

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా
టీమ్ఇండియా బ్యాటర్లు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యారని మరో ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ఒక మ్యాచ్​లో పేస్ బౌలింగ్​కు కుప్పకూలగా, మరొక మ్యాచ్​లో స్పిన్​కు వికెట్లు సమర్పించుకున్నారని అన్నాడు. దీనిపై ఎలాంటి సాకులు చెప్పలేరని తెలిపాడు. ఏడేళ్ల క్రితం పుణెలో ఆస్ట్రేలియా బౌలర్ స్టీవ్ ఒకీఫ్ భారత్​పై 6వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత కివీస్ ఆటగాడు 7వికెట్లు తీశాడని పోస్టులో పేర్కొన్నాడు. టీమ్ఇండియా బ్యాటింగ్ ఏ మాత్రం మారలేదని తెలిపాడు. భారత బ్యాటర్లు శాంటర్న్​ను ఎదుర్కొలేకపోయారని మరో అభిమాని పోస్టు చేశాడు. భారత్​ గడ్డ, ప్రేక్షకుల మధ్య విదేశీ ఆటగాడు అదరగొట్టాడని అందులో పేర్కొన్నాడు.

Cheteshwar Pujara Test Career: ఛతేశ్వర్ పుజారా 2010లో టెస్టు క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాపై తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్​లో ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన పుజారా 7195 రన్స్ చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్​ తరఫున 2023లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

25వ రంజీ సెంచరీ బాదిన పుజారా - బ్రియాన్ లారా రికార్డ్ బ్రేక్

గేరు మార్చిన పుజారా- టీ20 స్టైల్​లో మెరుపు సెంచరీ

ABOUT THE AUTHOR

...view details