Harbhajan Singh On Indian Captaincy:టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ భారత టీ20 జట్టు కెప్టెన్సీ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టీ20 ఫార్మాట్ బాధ్యతలు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు అప్పగించాలని అన్నాడు. రాజస్థాన్ తాజాగా ముంబయిపై విజయం సాధించిన తర్వాత హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'వికెట్ కీపింగ్ కమ్ బ్యాటింగ్ విషయంలో డిబేట్ అనవసరం. టీ20 వరల్డ్‌కప్‌లో సంజూ శాంసన్ స్థానం ఉంటుంది. ఇక రోహిత్ తర్వాత టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియాను నడిపించే సత్తా శాంసన్‌కు ఉంది' అని భజ్జీ అన్నాడు. ఇక సోమవారం ముంబయి- రాజస్థాన్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను కూడా భజ్జీ ప్రశంసించాడు. 'ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అని జైస్వాల్ తాజా ఇన్నింగ్స్‌తో నిరూపించాడు' అని ముంబయితో మ్యాచ్ అనంతరం భజ్జీ ట్వీట్ చేశాడు.