Rohit Sharma Wimbledon:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ తర్వాత రీఫ్రెష్ మోడ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్ రీసెంట్గా లండన్ పయనమయ్యాడు. అక్కడ ఫ్యామిలీతో కాస్త చిల్ అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. దీంతో వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ వింబుల్డన్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో ఫొటో షేర్ చేసింది.
సూట్ ధరించిన రోహిత్ క్లాసీ లుక్‌తో వింబుల్డన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్లూ షర్ట్, గ్రే కలక్ సూట్, టై విత్ గాగుల్స్‌తో అచ్చం హాలీవుడ్ హీరోలా ఎంట్రీ ఇచ్చి, విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని లైవ్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. మ్యాచ్‌కు ముందు రోహిత్ మాట్లాడాడు. 'నాకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఈ టోర్నీ జరుగుతుండగా నేను లండన్‌లోనే ఉండడం కలిసొచ్చింది. తొలిసారి నేను వింబుల్డన్‌కు వచ్చాను. ఈ క్రీడా వాతావరణాన్ని స్వయంగా ఎంజాయ్ చేద్దామని వచ్చా' అని అన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. 'హిట్‌మ్యాన్ లుక్స్ అదుర్స్', 'బాలీవుడ్ హీరో', 'కెప్టెన్ స్వాగ్' అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.