తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ కెప్టెన్​ ఇన్నింగ్స్​, బుమ్రా మ్యాజిక్​ - మ్యాచ్ హైలైట్​ వీడియోస్​ చూశారా? - T20 Worldcup 2024 Semifinal - T20 WORLDCUP 2024 SEMIFINAL

T20 Worldcup 2024 Semifinal : సెమీఫైనల్​లో ఇంగ్లాండ్‌ను ఓడించడంలో టీమ్‌ఇండియా బ్యాటర్లతోపాటు బౌలర్ల కృషి ఉంది. ఫీల్డింగ్‌లో అదరగొట్టేశారు. మ్యాచ్ హైలైట్స్ వీడియోస్ చూసేద్దాం.

source The Associated Press
T20 Worldcup 2024 Semifinal (source The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 12:10 PM IST

T20 Worldcup 2024 Semifinal : టీ20 ప్రపంచకప్​ 2024లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్​లో విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లింది టీమ్​ఇండియా. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి గెలిచింది. ఈ పోరులో బుమ్రా షాకింగ్‌ డెలివరీలతో మంచిగా రాణించాడు. అక్షర్ పటేల్​, కుల్దీప్ యాదవ్​ కూడా తామేం తక్కువ కాదంటూ అదరగొట్టారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తన బ్యాట్​కు పని చెప్పి మంచిగా ఆడాడు. మొత్తంగా టీమ్​ అంతా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. దీంతో దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు టీమ్​ఇండియా ముందు మంచి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హైలైట్స్​ వీడియోల చూసేద్దాం.

లాస్ట్ వికెట్​ - ఈ మ్యాచ్​లో ఆర్చర్‌ను ఔట్‌ చేసి టీమ్​ఇండియాకు విజయాన్ని అందించాడు బుమ్రా. వాస్తవానికి అంపైర్‌ ఔట్ ఇచ్చినప్పటికీ ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌ కోరింది. కానీ సమీక్షలో టీమ్​ఇండియాకు అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. దీంతో ఇంగ్లాండ్‌ ఓడి ఇంటిముఖం పట్టింది.

కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ - రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్​లో కెప్టెన్​గానే కాకుండా బ్యాటర్​గానూ రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసిన అతడు ఇంగ్లాండ్‌పైనా హాఫ్​సెంచరీ (57) బాది ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచడంలో కీలకంగా వ్యవహరించాడు.

సిక్స్‌ బాది ఔటైన విరాట్ - ప్రస్తుత ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరిగ్గా రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్​లోనూ ఫెయిల్ అయ్యాడు. అయితే ఓ మ్యాచ్​లో సిక్స్‌ బాది ఊపులోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ ఆ తర్వాత బంతికే బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

ఇంగ్లాండ్ కెప్టెన్‌ దూకుడుకు కళ్లెం - మ్యాచ్​ దూకుడు ప్రదర్శన కనబరిచాడు జోస్ బట్లర్‌. అయితే అతడి దూకుడుకు కళ్లెం వేశాడు అక్షర్ పటేల్. లెగ్‌సైడ్‌ వేసిన బాల్​ను ఆడబోయి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు బట్లర్. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది.

ఒకే ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు వికెట్లు - క్రిస్‌ జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్‌ పాండ్య రెండు సిక్స్‌లు బాదాడు. కానీ ఆ తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు. అయితే అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శివమ్‌ దూబె (0) గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.

బుమ్రా దెబ్బకు ఫిల్‌ సాల్ట్ షాక్ -బుమ్రా బౌలింగ్​కు టాప్ బౌలర్లంతా జాగ్రత్తగా ఆడుతుంటారు. కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించినా వికెట్‌ సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్‌ సాల్ట్‌కు ఇదే ఎదురైంది. బుమ్రా బౌలింగ్ చేసిన ఇన్‌స్వింగర్‌ను ఆడబోయి క్లీన్‌ బౌల్డ్​ అయ్యాడు.

సూపర్ ఫీల్డింగ్‌ - టీమ్​ఇండియా ఫీల్డర్లు అద్భుతంగా ఆడారు. రెండు కీలక వికెట్లను రనౌట్‌ రూపంలో పడగొట్టారు. మొదట లివింగ్‌స్టోన్ ఆ తర్వాత కాసేపటికే అదిల్ రషీద్ పెవిలియన్‌కు చేరారు.

రోహిత్ ఆనందభాష్పాలు - నవ్వించిన కోహ్లీ!

కోహ్లీ ఫామ్​పై రోహిత్ కీలక కామెంట్స్​ - ఏం అన్నాడంటే? - T20 Worldcup 2024

ABOUT THE AUTHOR

...view details