T20 Worldcup 2024 Babar azam Beats Dhoni Record :టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ -8కు చేరకుండానే నిష్క్రమించింది దాయాది దేశం పాకిస్థాన్. అయినా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం ఓ వరల్డ్ రికార్డుతో టోర్నీని ముగించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో 34 బంతుల్లో 32 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
Most runs in t20 world cup : ఈ క్రమంలోనే ధోనీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో బాబార్ టీ20 ప్రపంచకప్‌లో 17 ఇన్నింగ్స్‌లో 549 పరుగులు చేశాడు. దీంతో ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు మహీ పేరిట ఉంది. అతడు 29 ఇన్నింగ్స్‌లో 529 పరుగులు సాధించాడు. 2016 నుంచి అలానే ఉన్న ఆ రికార్డును ఇప్పుడు బాబర్ అధిగమించాడు. ఇక న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కూడా 527 పరుగులతో కొనసాగుతున్నాడు. జూన్ 17న పాపువా న్యూ గినియాతో జరగబోయే మ్యాచులో అతడు కూడా మహీ రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.