T20 World Cup Pakistan : అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్ క్రికెట్ జట్లలో ఒకటిగా కొనసాగుతోంది పాకిస్థాన్. ప్రతి టాప్ జట్టు అందుకున్నట్లుగానే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి ట్రోఫీలనూ అందుకుంది. కానీ, కొన్ని సార్లు ఐసీసీ ఈవెంట్లలో తక్కువ ర్యాంకు ఉన్న జట్లు కూడా పాక్‌ను పల్టీ కొట్టించాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ పసికూన యూఎస్ఏ కూడా పాకిస్థాన్‌ను ఓడించగలిగింది. ఇదే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో పాక్ పలు దారుణమైన పరాభవాలను ఎదుర్కొంది. అవేంటంటే? .
యూఎస్ఏ Vs పాకిస్థాన్
ఐసీసీ తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను యూఎస్ఏకు అప్పగించింది. తొలిసారి మెగా టోర్నీలో అడుగుపెట్టిన యూఎస్ఏ అనూహ్య రీతిలో టాప్ ర్యాంక్‌డ్ జట్టు అయిన పాకిస్థాన్‌ను జూన్ 6న జరిగిన డల్లాస్ మ్యాచ్‌లో చిత్తు చేసింది. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ చేసిన హాఫ్ సెంచరీతో జట్టు ఫలితం సూపర్ ఓవర్ వరకూ చేరింది. 159 పరుగులతో ఇరు జట్లు టై అవగా, సూపర్ ఓవర్లో సౌరబ్ నేత్రావల్కర్ అమెరికాను పాకిస్థాన్‌పై విజేతగా నిలిపాడు.
ఆఫ్గనిస్థాన్ Vs పాకిస్థాన్
వన్డే వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్‌లో క్వాలిఫై కాకపోయింది బాబర్ అజామ్ టీం. గ్రూపు స్టేజిలో ఆఫ్గనిస్థాన్ చేతిలో చిత్తవడమే ఇందుకు కారణం. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 283 పరుగుల లక్ష్యాన్ని చేధించగలిగింది.
ఐర్లాండ్ Vs పాకిస్థాన్
వరల్డ్ కప్‌లోకి ఐర్లాండ్‌కు అది అరంగ్రేట మ్యాచ్. ప్రత్యర్థి జట్టును 132 పరుగులకే కట్టడి చేసి లక్ష్యాన్ని 41.4ఓవర్లలో పూర్తి చేశారు. ఈ పరాజయంతో పాకిస్థాన్ గ్రూపు స్టేజిలోనే వెనుదిరగాల్సి వచ్చింది.