T20 Worldcup 2024 Semifinal Reserve Day : ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ 2024లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉంటే, రెండో సెమీస్‌కు మాత్రం అలా లేదు. దీంతో క్రికెట్ ప్రియులు అంతా అదేంటీ ఎందుకలా అంటూ చర్చించుకుంటున్నారు. దీని వల్ల టీమ్ ఇండియా తుదిపోరుకు చేరే అవకాశాలు ఏమైనా దెబ్బతింటాయా అనే అందోళన కూడా వారిలో కాస్త ఉంది. మరి ఇలా ఎందుకు రిజర్వ్ డే లేదో తెలుసుకుందాం.
మొదటి సెమీస్‌కు రిజర్వ్‌డే - అఫ్గానిస్థాన్ - దక్షిణాఫ్రికా(AFG vs SA) మధ్య తొలి సెమీ ఫైనల్ ట్రినిడాడ్ వేదికగా జరగనుంది. గురువారం(జూన్ 27) భారత కాలమాన ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. కానీ అక్కడి స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8.30 గంటలు. ఒకవేళ ఈ పోరుకు వర్షం వల్ల అంతరాయం కలిగితే, మ్యాచ్ పూర్తి కాకపోతే అదనంగా మరో 60 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అలానే రిజర్వ్ డే కూడా కేటాయించి ఆ రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా ఇచ్చారు.
నిజానికి మొదటి రోజే ఓవర్లను కుదించి మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. కానీ వర్షం కారణంగా అది కూడా సాధ్యం అవ్వకపోతేనే రిజర్వ్‌డేకు వెళ్తారు. అప్పుడు కూడా రిజర్వ్‌డేలో కుదించిన ఓవర్ల ప్రకారం మ్యాచ్‌ను నిర్వహిస్తారా? లేదా పూర్తిగా 20 ఓవర్లకు నిర్వహిస్తారా ? అనేది పరిస్థితిని బట్టి డిసైడ్ చేస్తారు.
మొదటి రోజే ఓవర్ల కుదింపునకు నిర్ణయం తీసుకున్నాక మళ్లీ వర్షం పడి ఒక్క బంతి కూడా పడకపోతే కుదించిన ఓవర్లు అమలు కావు. సాధారణంగానే 20 ఓవర్లు పూర్తయ్యేవరకు ఆడతారు. అదే ఒక బంతి పడినా రెండో రోజు కుదించిన ఓవర్లకే మ్యాచ్‌ను నిర్వహిస్తారు. రిజర్వ్‌డే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది.
వాస్తవానికి రిజల్ట్ తేలాలంటే సెమీస్ దశలో రెండు టీమ్స్ కనీసం 10 ఓవర్లైన ఆడాలి. గ్రూప్, సూపర్-8లోలాగా 5 ఓవర్లు ఆడితే కుదరదు. అదే వర్షం వల్ల మ్యాచ్ అస్సలు జరగకపోతే అధిక ర్యాంక్ జట్టే ఫైనల్స్ చేరుకుంటుంది. ఒకవేళ ఇదే జరిగితే గ్రూప్ 2లో సౌతాఫ్రికా, గ్రూప్-1లో భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. అదే ఫైనల్స్ కూడా వర్షం వల్ల రద్దైతే సంయుక్త విజేతలుగా అనౌన్స్ చేస్తారు.