తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదే మాలో బలమైన నమ్మకాన్ని తీసుకొచ్చింది : రషీద్ ఖాన్ - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 World Cup 2024 Rashid Khan : టీ20 వరల్డ్​కప్ 2024 బరిలోకి దిగబోతున్న తమ జట్టు గురించి కీలక కామెంట్స్ చేశాడు అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్​ ఖాన్​. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI news
Rashid Khan (Source ANI news)

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 11:23 AM IST

T20 World Cup 2024 Rashid Khan :టీ20 వరల్డ్ కప్​లో ప్రతిసారిలాగే ఈ సారి కూడా ఆఫ్గానిస్థాన్​ అండర్ డాగ్​గా బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్​లో రషీద్ ఖాన్ తొలిసారి తమ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహించే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే టీ20వరల్ట్ కప్ ఫార్మాట్‌లో నాలుగు సార్లు ఆడిన రషీద్ తాజా ఇంటర్వ్యూలో అఫ్గానిస్థాన్​ను గ్రూప్ దశ దాటి తీసుకెళ్లగలమని పేర్కొన్నాడు. అదే గ్రూపులో ఉన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లను తమ మిస్టరీ స్పిన్ బౌలింగ్‌తో కట్టడి చేయగలమని అన్నాడు. గ్రౌండ్స్ ఫ్లాట్‌గా ఉన్నా, అఫ్గానిస్థాన్ మిస్టరీ బౌలర్స్ నైపుణ్యంతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను ఇరకాటంలో పడేస్తారనే నమ్మకాన్ని కనబరుస్తున్నాడు.

"మాకు సూపర్ 8 స్టేజ్‌కు వెళ్లగలమనే నమ్మకం వెస్టిండీసే ఇచ్చింది. ఇప్పటికే పలు టీ20ల్లో, వన్డేల్లో కూడా ఆ జట్టును దెబ్బతీసాం. మా జట్టులో ఏడెనిమిది మంది ఐపీఎల్‌లో ఆడిన వాళ్లే ఉన్నారు. వరల్డ్ కప్‌కు ముందు అంతకంటే మంచి ప్రిపరేషన్ ఏం కావాలి. నా అంచనా ప్రకారం, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పిన్నర్లకు బాగా అనుకూలించేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ గ్రౌండ్స్ ఫ్లాట్‌గా అనిపిస్తున్నా మా బౌలింగ్ విభాగం, దానిని తిప్పేసుకోగలదు. మా దగ్గర ఉన్న మిస్టరీ స్పిన్నర్లతో కట్టడి చేయగలం, మా బ్యాటర్లతో ఫ్రీగా స్కోరు కూడా నమోదు చేయగలం. నేను (రషీద్), మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మన్, నూర్ అహ్మద్ ఇప్పటికే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో చాలా మ్యాచ్‌లకు బౌలింగ్ చేశాం. మాకు అక్కడి మైదానాల పరిస్థితులపై కూడా అవగాహన ఉంది. అది మాకు కలిసొచ్చే అంశం" అని రషీద్ పేర్కొన్నాడు.

వన్డే వరల్డ్ కప్ 2023లో అఫ్గానిస్థాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లను ఓడించి 10 జట్లున్న టోర్నమెంట్‌లో ఆరో స్థానం దక్కించుకుంది. ఈ విజయాల తర్వాత తమ నమ్మకం కూడా పెరిగిందని రషీద్ చెబుతున్నాడు. టోర్నమెంట్​లో ఏ జట్టునైనా ఎదుర్కోగలమనే ధైర్యమొచ్చిందని విశ్వసిస్తున్నాడు. గతేడాది ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ఈవెంట్‌లో ఇంగ్లాండ్‌పై కూడా గెలిచిన తర్వాత తమ నమ్మకం మరింత బలపడిందని రషీద్ వెల్లడించాడు.టీమ్​ఇండియా మాజీ కోచ్‌తో బరిలోకి పాకిస్థాన్ - ప్రభావం చూపుతుందా? - T20 World Cup 2024

ABOUT THE AUTHOR

...view details