తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రముప్పు - స్పందించిన ఐసీసీ - T20 World cup 2024

T20 World cup 2024 Terror Threat : అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్​నకు తాజాగా ఉగ్రవాదుల హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. దీనిపై ఐసీసీ స్పందించింది.

Source ANI
T20 World cup 2024 (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 11:56 AM IST

Updated : May 6, 2024, 2:06 PM IST

T20 World cup 2024 Terror Threat :అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్​నకు తాజాగా ఉగ్రవాదుల హెచ్చరికలు రావడం కలకలం రేపుతోంది. వెస్టీండిస్ బోర్డుకు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన బోర్డు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం ఈ విషయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ విషయంపై ఐసీసీ కూడా స్పందింది. "మేము ఆతిథ్య దేశాలు, అక్కడ నగరాల్లోని అధికారులతో మరింత దగ్గరగా పని చేస్తాము. భద్రతా ఏర్పాట్లపై నిరంతం పర్యవేక్షిస్తుంటాం. ఏమైనా ప్రమాదానికి సంబంధించిన సూచనలు కనిపించినా వాటిని అధిగమించేలా మా దగ్గర కట్టుదిట్టమైన ప్రణాళికలు ఉన్నాయి." అని పేర్కొంది.

ఈ బెదిరింపులపై క్రికెట్ వెస్టిండీస్ కూడా స్పందించింది. తమ దేశంలో జరిగే వరల్డ్ కప్​ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చింది. టోర్నీ సజావుగా సాగుతుందని క్రికెట్ వెస్టిండీస్ CEO జానీ గ్రేవ్స్ పేర్కొన్నారు. ప్రపంచకప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందుకోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం" అని తెలిపారు.

"21వ సెంచరీలోనూ ఉగ్రవాద ముప్పు పెరగడం దురదృష్టకరకం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీనిపై పోరాడాలి. అతిపెద్ద మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే ఛాన్స్​ మాకు అందింది. దీనిని విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. ఉగ్రమూకలు ఎలాంటి దాడులకు పాల్పడకుండా ఉండేలా, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రేక్షకులు ప్రశాంతంగా మ్యాచులు వీక్షించేందుకు వీలు కల్పించాం. ఇప్పటికే మా ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ చర్యల్లోనే నిమగ్నమై ఉన్నాయి." అని ట్రినిడాడ్ పీఎం కీత్‌ పేర్కొన్నారు.

కాగా, బయట వస్తున్న ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఈ బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇస్లామిక్ స్టేట్​ అనుకూల మీడియా గ్రూప్ ద్వారా ప్రపంచకప్‌నకు ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారం అందిందని కరీబియన్ మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి.

T20 World cup 2024 Schedule :టీ20 ప్రపంచకప్ 2024 జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌ యూఎస్‌ఏ డల్లాస్‌ నగరంలోని కొత్తగా నిర్మించిన మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ కెనడాతో పోడనుంది. టీమ్ ఇండియా తమ తొలి మ్యాచ్​ను జూన్‌ 5న ఆడనుంది. ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇక భారత్ పాకిస్థాన్ మ్యాచ్​ జూన్‌ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్‌ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ కోసం డ్రాప్ ఇన్ పిచ్‌లు - అసలు ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే? - ICC T20 World Cup 2024

టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్,​ రాహుల్ ఔట్​ - ICC T20 World Cup 2024

Last Updated : May 6, 2024, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details