Happy Birthday Rohith Sharma Teen age photo :'8 ఏళ్ల వయసు నుంచే నా ఇన్స్పిరేషన్ - ఆయన్ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను' - Rohit Sharma Inspirationటీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). నేడు అతడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు ఫ్యాన్స్, క్రికెటర్లు, సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా అంతా హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ అనే హ్యష్ ట్యాగ్‌ను ఫుల్ ట్రెండ్ చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వసీమ్ జాఫర్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు అయితే స్పెషల్ పోస్టర్లతో విషెస్ చెప్పాయి. ముంబయి ఇండియన్స్ సలామ్ రోహిత్ భాయ్ అంటూ ఓ సాంగ్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి తమకున్న అభిమానాన్ని తెలిపింది. ఇది క్రికెట్ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది.
"భారత క్రికెట్ ఉన్న అజేయ శక్తికి నా తరఫున బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాను. రోహిత్ నీ నాయకత్వ పటిమ, నైపుణ్యాలు, ఓటమిని అంగీకరించని వ్యక్తిత్వం మన జట్టుకు గుండె చప్పుడు లాంటిది. నువ్వు మరో ఏడాది కూడా బౌండరీలు బాదతూ చరిత్ర సృష్టించాలిని కోరుకుంటున్నాను" అని జై షా తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు.