తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇప్పటికీ మా బంధం అలానే ఉంది - అందుకే అటువంటి అవకాశం వచ్చింది' - India Tour Of Srilanka - INDIA TOUR OF SRILANKA

Suryakumar Yadav Srilanka Series : శ్రీలంక సిరీస్​ కోసం పయనమైన టీమ్ఇండియా ఇప్పుడు కొత్త కోచ్ గౌతమ్​ గంభీర్ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కోచ్ గంభీర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Suryakumar Yadav Srilanka Series
Suryakumar Yadav (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 12:10 PM IST

Suryakumar Yadav Srilanka Series :శ్రీలంక సిరీస్​లో భాగంగా టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది టీమ్‌ఇండియా. కొత్త కోచ్‌ గంభీర్‌ శిక్షణలో అలాగే, కొత్త కెప్టెన్​ సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో మన యంగ్ ప్లేయర్స బరిలోకి దిగనున్నారు. అయితే కోచ్​గా గంభీర్ ఎలా ఉన్నారన్న విషయంపై సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్​తో తనకు ఓ స్పెషల్ బాండింగ్ ఉందని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది.

"మా ఇద్దరి బంధం చాలా ప్రత్యేకమైనది. 2014లో నేను గంభీర్‌ సారథ్యంలోనే కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. అప్పటి నుంచే నాకు క్రికెట్​లో ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయి. ఇరువురి బంధం ఇప్పటికీ బలంగానే ఉంది. నేను ఎలా ఆడతానో, ప్రాక్టీస్‌ సెషన్‌లో నా మైండ్‌ సెట్‌ ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. ఓ కోచ్‌గా ఆయన ఎలా పనిచేస్తారో కూడా నేను చూశాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎటువంటి రిజల్ట్​ రానుందో అంటూ నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఓ కెప్టెన్‌గా కాకపోయినా మైదానంలో లీడర్‌గా ఉండేందుకు నేను అమితంగా ఇష్టపడుతుంటాను. ఇప్పటివరకూ ఎంతోమంది కెప్టెన్ల నుంచి పలు కొత్త విషయాలను తెలుసుకున్నాను. ఈ కెప్టెన్సీ నాకు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. నాకిచ్చిన ఈ గొప్ప బాధ్యతను కచ్చితంగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తాను" అంటూ స్కై ఆనందం వ్యక్తం చేశాడు.

TeamIndia Squad for SriLanka 2024 :భారత్‌, శ్రీలంక మధ్య 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌ సిరీస్‌లు జరగనున్నాయి. శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ . కొత్త ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ జట్టు ఎంపికపై సుదీర్ సమాలోచనలు జరిపిన తర్వాత జట్టును అనౌన్స్​ చేశారు. ఈ సిరీస్​కు రోహిత్‌ శర్మ వన్డేలకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో అతడికే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీ20లకు రోహిత్​ రిటైర్మెంట్​ ప్రకటించడం వల్ల సూర్యకుమార్‌ యాదవ్‌ను టీ20కి సారథిగా నియమించారు.

రూ.120కోట్ల పర్స్​ వ్యాల్యూ- రిటెన్షన్ ఆప్షన్​లో మార్పు- IPL 2025 మెగా వేలం! - IPL 2025 Mega Auction

టెస్టు ర్యాంకింగ్స్ రిలీజ్- అగ్రస్థానానికి చేరువలో రూట్- మరి రోహిత్, విరాట్ ప్లేస్? - ICC Test Ranking 2024

ABOUT THE AUTHOR

...view details