తెలంగాణ

telangana

ETV Bharat / sports

MIకి బ్యాడ్​న్యూస్- సూర్య కుమార్ ఇప్పట్లో రాలేడు! - Suryakumar Yadav IPL 2024 - SURYAKUMAR YADAV IPL 2024

Suryakumar Yadav IPL 2024: ముంబయి ఇండియన్స్ జట్టుకు బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్​లో ఇంకొన్ని మ్యాచ్​లకు దూరం కానున్నాడు.

Suryakumar Yadav IPL 2024
Suryakumar Yadav IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 3:54 PM IST

Updated : Mar 28, 2024, 7:53 PM IST

Suryakumar Yadav IPL 2024:2024 ఐపీఎల్​లో వరుసగా రెండు మ్యాచ్​ల్లో ఓటమిని చవి చూసిన ముంబయి ఇండియన్స్​ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ మరికొన్ని మ్యాచ్​లకు కూడా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన స్కై, గత కొంతకాలంగా బెంగళూరులోని ఎన్​సీఏలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటూ క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఏప్రిల్ 1న రాజస్థాన్​తో జరగనున్న మ్యాచ్​లోపు అందుబాటులోకి వస్తాడని తొలుత జట్టు సభ్యులు భావించారు. కానీ సూర్య ఇంకొన్ని మ్యాచ్​లకు కూడా దూరం కానున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా తెలిపారు.

'సూర్య ట్రీట్​మెంట్​లో ప్రోగ్రెస్ ఉంది. అతడు అనుకున్న దానికంటే వేగంగానే కోలుకుంటున్నాడు. కానీ, ప్రస్తుతానికి అతడు మరికొన్ని మ్యాచ్​లకు మాత్రం దూరం కానున్నాడు' అంటూ ఆ అధికారి పేర్కొన్నారు. మరోవైపు జూన్​లో జరగనున్న టీ20 వరల్డ్​కప్ కోసం స్టార్ బ్యాటర్ల ఫిట్​నెస్ గురించి బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సూర్యను ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఎన్​సీఏలోనే ఉంచనున్నట్లు సమాచారం.

ఇక మ్యాచ్​ విషయానికి - వస్తే హైదరాబాద్​లోని ఉప్పల్ వేదికగా ఆడిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ చివర్లో కాస్త తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 రన్స్ చేసింది. హైదరాబాదీ ప్లేయర్ తిలక్‌వర్మ (34 బంతుల్లో 2×4, 6×6 పరుగులు సాయంతో 64), టిమ్‌ డేవిడ్‌ ( 22 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 42 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 34) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. సన్​రైజర్స్​ బౌలింగ్​లో ఉనద్కత్‌ 2, కమిన్స్‌ 2, షాబాజ్‌ అహ్మద్‌ 1 వికెట్లు తీశారు.

ముంబయి తుది జట్టు : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్‌, తిలక్ వర్మ, పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, కోయెట్జీ, షామ్స్ ములానీ, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా

'కెప్టెన్సీ అంటే కాఫీ తాగినంతా ఈజీ కాదు'- హార్దిక్​పై నెటిజన్లు ఫైర్ - Hardik Pandya Captain IPL

SRH x MI- సన్​రైజర్సే కాదు- ముంబయిదీ రికార్డే - IPL Mumbai Indian Records

Last Updated : Mar 28, 2024, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details