తెలంగాణ

telangana

ETV Bharat / sports

అగ్రస్థానాన్ని కోల్పోయిన హార్దిక్​ - అదరగొట్టిన గైక్వాడ్​, అభిషేక్ శర్మ - ICC Latest T20 Rankings - ICC LATEST T20 RANKINGS

ICC Latest T20 Rankings : ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ​ అదరగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ తన రెండో స్థానాన్ని కొనసాగించాడు. బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయ్ సత్తా చాటాడు. ఆల్​రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్య తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు.

source Getty Images,  ANI, Associated Press,
ICC Latest T20 Rankings (source Getty Images, ANI, Associated Press,)

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 3:21 PM IST

ICC Latest T20 Rankings : ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ సత్తా చాటి మళ్లీ టాప్​-10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 662 పాయింట్లతో ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. జింబాబ్వేపై రెండో టీ20 టీమ్​ఇండియా గెలవడంలో 77 పరుగులతో కీలకంగా వ్యవహరించిన అనంతరం ఈ మార్క్​ను అందుకున్నాడు

ఇక ఈ సిరీస్​తో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో టీ20లో 46 బంతుల్లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనతో తాజా ర్యాంకింగ్స్​లో 75వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టాప్​-10లో టీమ్​ఇండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతడు తన రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో టాప్ - 10 ప్లేయర్స్ వీరే

1. ట్రావిస్ హెడ్ - 844

2. సూర్యకుమార్ యాదవ్ - 821

3. ఫిల్ సాల్ట్ - 797

4. బాబర్ ఆజం - 755

5. మహ్మద్ రిజ్వాన్ - 746

6. జాస్ బట్లర్ - 716

7. రుతురాజ్ గైక్వాడ్ - 662

8. బ్రాండన్ కింగ్ - 656

9. జాన్సన్ చార్లెస్ - 655

10. ఐడెన్ మరక్రమ్ - 646

ఆల్​రౌండర్ విభాగంలో టాప్ ప్లేస్​లో కొనసాగిన హార్దిక్ పాండ్య ఈ జింబాబ్వే పర్యటనకు దూరమవ్వడంతో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండో ర్యాంకుకు పడిపోయాడు. అగ్రస్థానంలో లంక ప్లేయర్ వనిందు హసరంగ 222 పాయింట్లతో నిలిచాడు. 12వ స్థానంలో అక్సర్ పటేల్ ఉన్నాడు.

బౌలింగ్ విభాగంలో లెఫ్ట్ ఆర్మ్​ స్పిన్నర్ అక్సర్​ రెండు స్థానాలు పడిపోయి 644 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు. మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్​ కుల్దీప్ యాదవ్ ముడు స్థానాలు పడిపోయి 11 ర్యాంకుకు, టీ2 ప్రపంచకప్ 2024 ప్లేయర్ బుమ్రా రెండు స్థానాలు పడిపోయి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి రెండు టీ20ల్లో ఆరు వికెట్లు తీసిన రవి బిష్ణోయ్​ 8 స్థానాలు ఎగబాకి 14 ప్లేస్​లో నిలిచాడు. ఇక 5 స్థానాలు కిందకు పడిపోయి 19వ ప్లేస్​లో అర్షదీప్ సింగ్ నిలిచాడు.

రచిన్​కు బంపర్ ఆఫర్ - సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్​లో చోటు

సపోర్టింగ్ స్టాఫ్​పై గంభీర్ ఫోకస్- కొత్త బ్యాటింగ్ కోచ్​గా సీనియర్! - Team India Batting Coach

ABOUT THE AUTHOR

...view details