Sunil Gavaskar Fake Posts : సోషల్ మీడియా వేదికగా తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డారు. ఇటీవలే కోహ్లీ, బుమ్రా కెప్టెన్సీపై విశ్లేషణ అంటూ ఓ ఓ క్రీడా వెబ్‌సైట్‌కు సంబంధించిన ఆర్టికల్ తెగ ట్రెండ్ అయ్యింది. అయితే అది ఆయన పేరుపై రావడం వల్ల గావస్కర్ ఆశ్చర్యపోయాడు. తాను అటువంటిదేవీ రాయలేదని క్లారిటి ఇచ్చాడు. అంతేకాకుండా ఆ వెబ్‌సైట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసి అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.
"ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీది నిజం అని అనుకోవద్దు. నేను ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. మీరు ఇప్పుడు నా పేరుపై చూస్తున్నది ఫేక్. ఈ పనికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని గావస్కర్ క్లారిటీ ఇచ్చాడు.
ఇక గావస్కర్ ప్రస్తుతం బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కోసం ప్రముఖ స్పోర్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌తో ఆయన కొలాబరేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ కామెంటేటర్‌గా ఉన్నాడు. అయితే గతంలో ఆసీస్ గడ్డపై జరిగిన రెండు సిరీసుల్లోనూ రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ తన సారథ్యంలోనే జట్టును విజేతగా నిలిపాడు. ఆ జట్టుకు ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్ అందించాడు. అయితే, ఈ సారి మాత్రం తొలి టెస్టు ప్రారంభానికి ముందు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడన్న వార్తల నేపథ్యంలో గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.