తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒక్క పరుగు తేడాతో సన్​రైజర్స్​ థ్రిల్లింగ్ విక్టరీ - IPL 2024 - IPL 2024

SRH vs RR IPL 2024: ఉప్పల్​ వేదికగా ఉత్కంఠగా, ఎన్నో మలుపులు తిరుగుతూ సాగిన మ్యాచ్​లో ఒక్క పరుగు తేడాతో సన్​రైజర్స్ విజయాన్ని అందుకుంది. పూర్తి మ్యాచ్ వివరాలు స్టోరీలో.

SRH vs RR IPL 2024
SRH vs RR IPL 2024 (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 10:57 PM IST

Updated : May 3, 2024, 6:25 AM IST

SRH vs RR IPL 2024 :తాజాగా ఉప్పల్‌ వేదికగా ఉత్కంఠగా, ఎన్నో మలుపులు తిరుగుతూ సాగిన మ్యాచ్​లో ​ఎట్టకేలకు విజయాం సన్​రైజర్స్​ను వరించింది. చివరి బంతి వరకు గెలుపు దోబూచులాడుతూ రసవత్తరంగా సాగి అభిమానులను తెగ ఉర్రూతలూగించింది.

మొదట తొలి 8 ఓవర్లలో 48/2తో తక్కువ స్కోరుతో కనిపించిన సన్‌రైజర్స్‌ను తెలుగు కుర్రాడు నితీశ్​ కుమార్‌ రెడ్డి తన ధనాధన్​ ఇన్నింగ్స్‌తో స్కోరును రెండొందలు దాటించాడు. ఇక రాజస్థాన్‌ ఛేదనలోనూ ఒక్క పరుగుకే రెండు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ పట్టుబిగించేలా చేసింది. కానీ పరాగ్‌, యశస్వి 134 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్​ను గెలుపు ముంగిట నిలిపారు. ఆఖర్లో సన్​రైజర్స్​ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చకచకా వికెట్లు తీసినప్పటికీ పావెల్‌ తన అద్భుత బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ను గెలుపు అంచులదాకా తీసుకెళ్లాడు. ఇక చివరి బంతికి రాజస్థాన్​ రెండు పరుగులు చేయాల్సిన సమయంలో పావెల్‌ వికెట్ల ముందు దొరికిపోవడంతో సన్‌రైజర్స్‌ చెంతకు విజయం చేరింది.

ఈ విజయంతో దుమ్ములేపినసన్‌రైజర్స్‌ వరుసగా నాలుగు విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న రాజస్థాన్‌కు అడ్డుకట్ట వేసింది. 201 పరుగుల ఛేదనలో దూసుకుపోయిన రాజస్థాన్ 7 వికెట్లకు 200 చేసి ఒక్క పరుగు తేడాతో ఓడింది. యశస్వి జైస్వాల్‌ (67; 40 బంతుల్లో 7×4, 2×6), రియాన్‌ పరాగ్‌ (77; 49 బంతుల్లో 8×4, 4×6) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరి ఓవర్​లో అద్భుతంగా బౌలింగ్ చేసి విజయాన్ని అందించిన భువి (3/41) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (58 పరుగులు), నితీశ్ రెడ్డి (76 పరుగులు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో హెన్రీచ్ క్లాసెన్ (42 పరుగులు, 19 బంతుల్లో; 3x4, 3x 6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (12 పరుగులు), అన్​మోల్​ప్రీత్ సింగ్ (5 పరుగులు) స్వస్ప స్కోర్లకే పెలివియన్ చేరారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ దక్కించుకున్నారు.

వెస్టిండీస్ ప్లేయర్​కు షాక్- 5ఏళ్లు బ్యాన్ చేసిన ఐసీసీ - Devon Thomas Banned

T20 వరల్డ్​కప్ సాంగ్ రిలీజ్- పొట్టికప్​ సంబరాలు షురూ! - T20 World Cup 2024

Last Updated : May 3, 2024, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details