తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​కు నిరాశే - 4 వికెట్ల తేడాతో సన్​రైజర్స్ విక్టరీ - IPL 2024 - IPL 2024

SRH VS PBKS IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా తాజాగా పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్ల తేడాతో చేధించింది.

SRH VS PBKS IPL 2024
SRH VS PBKS IPL 2024 (Source : Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 7:15 PM IST

Updated : May 19, 2024, 7:57 PM IST

SRH VS PBKS IPL 2024 :ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా తాజాగా పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ జట్టు మరో సూపర్ విక్టరీనీ సాధించింది. సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్ల తేడాతో చేధించింది. అభిషేక్ శర్మ(66), రాహుల్ త్రిపాఠి (33), నితీశ్ రెడ్డి (37), హెన్రిచ్ క్లాసెన్ ​(42), తమ సూపర్ ఇన్నింగ్స్​తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్​, హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా, హర్రీత్ బ్రార్​, శశాంక్ సింగ్ చెరో వికెట్​ను తమ ఖాతాలో వేసుకున్నారు.

అంతకుముందు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే (46), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (71), జట్టుకు మంచి స్కోర్ అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక అదే జట్టుకు చెందిన రిలీ రోసో (49), జితేశ్‌ శర్మ (32*) కూడా మంచి స్కోర్ అందించారు. ఇక హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్‌, విజయ్‌కాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

హైదరాబాద్‌ తుది జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీశ్‌ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షహబాజ్‌ అహ్మద్, సన్విర్‌ సింగ్, భువనేశ్వర్‌ కుమార్, విజయ్‌కాంత్, టి నటరాజన్‌.
ఇంపాక్ట్ ప్లేయర్స్ : ట్రావిస్ హెడ్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్‌, వాషింగ్టన్ సుందర్, జయ్‌దేవ్ ఉనద్కత్

పంజాబ్ కింగ్స్ తుది జట్టు :జితేశ్‌ శర్మ (కెప్టెన్/వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ తైడే, రిలీ రొసో, శశాంక్‌ సింగ్, అశుతోష్‌ శర్మ, శివమ్‌ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ : అర్ష్‌దీప్‌ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌధరి, విధ్వత్‌ కవేరప్ప, హర్‌ప్రీత్ సింగ్ భాటియా.

RCB నయా హీరో యశ్- అంతా అదృష్టం కలిసిరావడం వల్లే! - IPL 2024

ఉత్కంఠ పోరులో సీఎస్కేకు షాక్​ - ప్లే ఆఫ్స్​కు ఆర్సీబీ - IPL 2024 CSK VS RCB

Last Updated : May 19, 2024, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details