తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉప్పల్​లో సన్​రైజర్స్​ విక్టరీ- 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం - SRH vs CSK IPL 2024

SRH vs CSK IPL 2024: ఉప్పల్​ వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్ అదరగొట్టింది. ప్రత్యర్థి చెన్నైపై ఆల్​రౌండ్​ ఆధిపత్యం చలాయించి 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

SRH vs CSK
SRH vs CSK

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 10:55 PM IST

SRH vs CSK IPL 2024:2024 ఐపీఎల్​లో ఉప్పల్​ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ అదరగొట్టింది. సొంత మైదానంలో చెన్నైపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో ఛేదించింది. ఎయిడెన్ మర్​క్రమ్ (50 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2, దీపక్ చాహర్, మతీషా పతిరణ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మెరుపు ఆరంభం
166 పరుగుల ఛేదనను సన్​రైజర్స్​ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఉప్పల్​లో బౌండరీల వర్షం కురింపించాడు. ఈ యంగ్ బ్యాటర్ (37 పరుగులు, 12 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్​లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అయితే మూడో ఓవర్లో దీపక్ చాహర్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించిన అభిషేక్ క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు. అప్పటికి సన్​రైజర్స్​ స్కోర్ 2.4 ఓవర్లలో 46.

ఇక వన్​డౌన్​లో వచ్చిన మర్​క్రమ్​తో కలిసి ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ (31 పరుగులు) 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోర్ 100 దాటిన తర్వాత హెడ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన మర్​క్రమ్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​తో అర్ధ శతకం పూర్తి చేశాడు. ఫిఫ్టీ కంప్లీటైన వెంటనే మర్​క్రమ్​ను మొయిన్ అలీ ఎల్​బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. ఇక చివర్లో నితీశ్ రెడ్డి (14*), హెన్రీచ్ క్లాసెన్ (10*) మిగిలిన లక్ష్యం పూర్తి చేశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే (45 పరుగులు, 24 బంతుల్లో), అజింక్యా రహానే (35 పరుగులు), రవీంద్ర జడేజా (31* పరుగులు) రాణించారు. ధోనీ చివర్లో బ్యాటింగ్​కు వచ్చి సింగిల్ తీశాడు. సన్​రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, షహబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాద్కత్, పాట్ కమిన్స్​ తలో వికెట్ దక్కించుకున్నారు.

సన్​రైజర్స్ 'తగ్గేదేలే'- బాలయ్య, పవన్ కల్యాణ్ మేనరిజంతో కెమెరాకు ఫోజులు - Sunrisers Hyderabad Ipl 2024

హోమ్​ గ్రౌండ్​లో ఆల్​రౌండ్​ షో- హైదరాబాద్‌పై గుజరాత్‌ విజయం - IPL 2024 GT VS SRH

ABOUT THE AUTHOR

...view details