Sourav Ganguly T20 World Cup 2024 :టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తనపై కామెంట్ చేసే విమర్శకులపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. వారందరూ ఓ విషయం గురించి మర్చిపోయారంటూ వ్యాఖ్యానించాడు.
టీ20 ప్రపంచప్ గెలుపుతో దేశమంతా సంబరాలు చేసుకున్నారని, ఆ ఖ్యాతిని కొనియాడుతున్నారని అన్నాడు. అయితే ఈ విజయానికి వెనక ఉన్న రోహిత్ శర్మను టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చేసిన తనను మాత్రం అందరూ మర్చిపోయారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
"రోహిత్ శర్మకు నేను టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు అందించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు అతడి సారథ్యంలోనే భారత్ టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో అందరూ నన్ను విమర్శించడం మానేశారు. అందరూ ఆ విషయాన్ని మరచిపోయారని నేను అనుకుంటున్నా. రోహిత్‌ను భారత జట్టుకు కెప్టెన్‌గా నియమించింది నేనే" అంటూ గంగూలీ అన్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించిన సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్నాడు. అయితే గంగూలీ తీసుకున్న నిర్ణయం గురించి చాలా మంది నుంచి ఆయన్ను విమర్శించడం మొదలెట్టారు. అది సరైనదని కాదంటూ కామెంట్ చేశారు.