Ganguly On Gautam Gambhir:టీమ్ఇండియా హెడ్‌కోచ్ ఎంపికపై క్రీడా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ కోచ్‌గా వస్తే మాత్రం జట్టులో మంచి మార్పు తీసుకొస్తాడని అభిప్రాయపడ్డాడు.
'కోచ్ పదవికి గంభీర్ అప్లై చేసుకున్నాడో లేదో తెలీదు. కానీ, కోచ్‌గా గంభీర్ ఎంపికైతే మాత్రం అది మంచి నిర్ణయమే. గంభీర్ నిజాయితీపరుడు. ఐపీఎల్లో కోల్‌కతాను మెంటార్‌గా విజయవంతంగా నడిపించాడు. టీమ్ఇండియాకు హెడ్‌కోచ్ అయ్యేందుకు అన్ని లక్షణాలు గంభీర్‌కు ఉన్నాయి. కానీ, ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేయడం, ఇంటర్నేషనల్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించడం రెండూ భిన్నమైన పాత్రలు. భారత్ వంచి అత్యుత్తమ జట్టు విషయంలో ఇది ఇంకా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. అయితే గౌతమ్ గంభీర్‌కు ఇలాంటి వాటిపై పూర్తి అవగాహన ఉంది. విరాట్, రోహిత్ వంటి స్టార్లను ఎలా డీల్ చేయాలనేది తెలుసు. డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితులను త్వరగా అలవర్చుకుని కలిసిపోతాడు. తన ఉద్దేశాలే కాకుండా జట్టులోని సభ్యుల ఆలోచనలనూ రిగణనలోకి తీసుకుంటాడు. తప్పకుండా గొప్ప హెడ్ కోచ్ అవుతాడనడంలో సందేహం లేదు. కానీ, ఈ పదవిని తీసుకోవడానికి అతడు అంగీకరిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరం' అని గంగూలీ అన్నాడు.