Sourav Ganguly Accident :టీమ్ఇండియా మాజీ ప్లేయర్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరభ్ గంగూలీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి ఆయన బుర్ద్వాన్ వెళ్తుండగా, దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గంగూలీకి త్రుటిలో తప్పిన ప్రమాదం- 10నిమిషాలు 'దాదా' రోడ్డుపైనే! - SOURAV GANGULY ACCIDENT
గంగూలీకి త్రుటిలో తప్పిన ప్రమాదం- 10 నిమిషాలు రోడ్డుపైనే ఉన్న మాజీ ప్లేయర్

Sourav Ganguly Accident (Source : ANI)
Published : Feb 21, 2025, 10:03 AM IST
ఓ ఈవెంట్కు హాజరయ్యేందుకు గంగూలీ బుర్ద్వాన్ వెళ్తున్నారు. హైవేపై ఆయన ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఓ ట్రక్కు అడ్డు రావడం వల్ల ఆయన సడెన్ బ్రేకులు వేయాల్సి వచ్చింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొడుతూ గంగూలీ కారును బలంగా తాకాయి. అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురిసినట్లు తెలిసింది.