Single Team Players IPL:ఐపీఎల్ టైటిల్ వేట రసవత్తరంగా ఉంటుంది. అన్ని టీమ్‌లు నువ్వా నేనా అన్నట్లు ఢీకొడుతుంటాయి. అన్ని ఫ్రాంచైజీలు ఉత్తమ జట్టును బరిలోకి దించడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో కొంత మంది ప్లేయర్‌లను వదులు కోవచ్చు, కొంత మందిని తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్లేయర్‌లు కూడా తమ ఫ్రాంచైజీ వదిలేయాలని నిర్ణయించుకోవచ్చు. 2023లో జరిగిన మినీ వేలంలో కూడా చాలా మంది టీమ్‌లు మారారు, కొత్త వాళ్లు అవకాశాలు పొందారు. అయితే కొంత మంది ప్లేయర్‌లు మాత్రం ఐపీఎల్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఒకే టీమ్‌లో కొనసాగారు, ఇంకా కొనసాగుతున్నారు.
- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): విరాట్ కోహ్లీ 2008లో RCBలో చేరాడు. అప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. 17 సీజన్లుగా ఆడిన అన్ని ఐపీఎల్ సీజన్లలో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు విరాట్ మాత్రమే.
- జస్ప్రీత్ బుమ్రా (ముంబయి ఇండియన్స్):జస్ప్రీత్ బుమ్రా 2013 నుంచి ముంబయి ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. అతడు ఐదుసార్లు టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడు.
- లసిత్ మలింగ (ముంబయి ఇండియన్స్):శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ తరఫున మొత్తం 122 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 170 వికెట్లు పడగొట్టాడు. నాలుగు టైటిల్స్ గెలవడంలో మలింగ్ కీలక పాత్ర పోషించాడు.
- సచిన్ తెందూల్కర్ (ముంబయి ఇండియన్స్): సచిన్ తెందూల్కర్ ముంబయి ఇండియన్స్ తరఫున ఆరు సీజన్లలో మొత్తం 78 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2013లో ఐపీఎల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడుగా ఉన్నాడు.
- మిచెల్ మెక్‌క్లెనగన్ (ముంబయి ఇండియన్స్): మిచెల్ మెక్‌క్లెనగన్ నాలుగుసార్లు IPL విజేత. అతను MI కోసం ఆరు సీజన్లలో మొత్తం 56 మ్యాచ్‌లు ఆడాడు.
- కీరన్ పొలార్డ్ (ముంబయి ఇండియన్స్): కీరన్ పొలార్డ్‌ని ఐపీఎల్ 2010 వేలంలో ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. పొలార్డ్ MI తరఫున 13 సీజన్లలో మొత్తం 189 మ్యాచ్‌లు ఆడాడు.
- సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్):సునీల్ నరైన్ 2012లో KKRలో చేరాడు. అప్పటి నుంచి కేకేఆర్‌లో కొనసాగుతున్నాడు. అతను IPLలో నైట్ రైడర్స్ తరఫున ఆల్-టైమ్ లీడింగ్ వికెట్- టేకర్. 2012, 2018 ఐపీఎల్ సీజన్‌లో మోస్ట్ వ్యాలుబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు.
- రిషబ్ పంత్ (దిల్లీ క్యాపిటల్స్): 2016 నుంచి రిషబ్ పంత్ దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు దిల్లీ తరఫున మొత్తం 98 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
- పృథ్వీ షా (దిల్లీ క్యాపిటల్స్): 2018 మెగా వేలంలో పృథ్వీ షాని దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి దిల్లీ జట్టుతోనే కొనసాగుతున్నాడు. 24 ఏళ్ల షా దిల్లీ తరఫున 71 మ్యాచ్‌లు ఆడాడు.
- షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్): రాజస్థాన్ రాయల్స్ తరఫున షేన్ వార్న్ మొత్తం 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 2008లో రాయల్స్‌కు మొట్టమొదటి ఐపీఎల్ కప్ అందించాడు.
- షాన్ మార్ష్ (పంజాబ్ కింగ్స్): 2008 ఎడిషన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా బ్యాటర్ షాన్ మార్ష్, PBKS తరపున 71 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
- సిద్ధార్థ్ త్రివేది( రాజస్థాన్ రాయల్స్): ఈ జాబితాలో త్రివేది మాత్రమే అన్‌క్యాప్డ్ ప్లేయర్. అతను స్పాట్ ఫిక్సింగ్‌పై నిషేధానికి గురయ్యే ముందు రాజస్థాన్ రాయల్స్ తరఫున 76 మ్యాచ్‌లు ఆడాడు.