తెలంగాణ

telangana

ETV Bharat / sports

19 ఏళ్లకే నాలుగు ఒలింపిక్​ పతకాలు - ఎవరీ సిమోన్ అరియన్ బైల్స్? - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Simone Arianne Biles Owens Paris Olympics 2024 : ఆరేళ్ల క్రిత్రం జిమ్నాస్టిక్స్​ ఈవెంట్​లో ఓ 19 ఏళ్ల యువతి చేసిన ఫీట్​ను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు క్రీడాభిమానులు. తన తొలి గేమ్​లోనే ఆ అమ్మాయి అంతటి అద్భుతాలు సృష్టించడమే దానికి కారణం. అయితే అనుహ్యంగా ఆమె ఈ ఆటకు దూరమైంది. కానీ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్​తో మరోసారి సూపర్ కమ్​బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరీ ఈ విశ్వక్రీడల్లో ఆ యంగ్ జిమ్నాస్ట్ జర్నీ ఎలా సాగిందంటే?

Simone Arianne Biles Owens Paris Olympics 2024
Simone Arianne Biles Owens (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 9:20 AM IST

Simone Arianne Biles Owens Paris Olympics 2024 :ఆమెకు అది తొలి ఒలింపిక్ ఈవెంట్​. సాధారణంగా ఎవరైనా సరే ఆ సమయంలో కాస్త ఒత్తిడిలోనే ఉంటారు. కానీ అమెరికాకు చెందిన సిమోన్ అరియన్ బైల్స్ ఓవెన్స్ మాత్రం 19 ఏళ్ల వయసులోనే ఈ విశ్వక్రీడల్లో తన సత్తా చాటిండి. జిమ్నాస్టిక్స్‌లో ఏకంగా 4 స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించి తన విన్యాసాలతో అందరినీ అబ్బురపరిచింది. ఈ రికార్డుతో అప్పట్లో ఆమె పేరు ప్రపంచమంతా తెగ మార్మోగిపోయింది. అయితే టోక్యో ఒలింపిక్స్​ సమయంలో మానసిక రుగ్మతతో ఇబ్బంది పడ్డ ఆమె ఆ ఈవెంట్​లో ఒక్క రజతం, కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాత అనారోగ్యంతో పాటు ఇతర కారణాల వల్ల కొద్దికాలం పాటు ఆటకు దూరమైంది.

2023లో జోనాథన్ ఒవెన్స్ అనే క్రీడాకారుడితో ఆమె వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఆటపై ఉన్న ప్రేమ ఆమెను ఈ క్రీడకు ఎక్కువకాలం పాటు దూరం చేయలేకపోయింది. దీంతో మానసికంగా, శారీరకంగా పుర్తి పరిణతి సాధించి ఈ పారిస్ ఒలింపిక్స్​కు సాలిడ్​ కమ్​బ్యాక్ ఇవ్వనుంది. ఇటీవలే జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని ముద్దాడింది.

ఇక ఆదివారం జరగనున్న జిమ్నాస్టిక్ టీమ్, ఆల్‌రౌండ్‌ క్వాలిఫికేషన్​లో బైల్స్‌ తన పెర్ఫామెన్స్​తో​ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. క్వాలిఫైయింగ్​ రౌండ్​లో బ్యాలెన్స్‌ బీమ్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్, వాల్ట్, అన్‌ఈవెన్‌ బార్స్‌లో ఈమె తలపడనుంది. అమెరికా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె తన పెర్ఫామెన్స్​తో ఇక్కడ కూడా కీలకం కానుంది. ఈమెతో పాటు ఈ పోటీలో 16 ఏళ్ల హెజ్లీ రివెరాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఈ క్రీడలో టీనేజర్లదే ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో 27 ఏళ్ల వయసులోనూ వాళ్లకు దీటుగా బైల్స్‌ సత్తాచాటేందుకు సిద్ధమైంది. అయితే జిమ్నాస్టిక్స్‌లో ఇప్పటికే వివిధ విభాగాల్లోని కొన్ని విన్యాసాలకు బైల్స్‌ పేరు పెట్టారు. ఇప్పుడు ఈ అన్‌ఈవెన్‌ బార్స్‌లోనూ ఓ విన్యాసానికి ఆమె పేరు పెట్టే అవకాశాలనున్నాయని తెలుస్తోంది.

తండ్రి చివరి కోరిక నేరవేర్చనున్న జార్జియా షూటర్ - ఎవరీ నినో ? - Paris Olympics 2024

వెదురు కర్రలతో ప్రాక్టీస్‌ నుంచి పారిస్‌ వరకు- ఒలింపిక్స్​లో 'ఆమె'పైనే ఆశలన్నీ! - Paris olympics 2024

ABOUT THE AUTHOR

...view details