తెలంగాణ

telangana

ETV Bharat / sports

గిల్ గాయంపై బౌలింగ్​ కోచ్ అప్​డేట్! - ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

శుభ్​మన్​ గిల్ గాయంపై టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ అప్​డేట్​-'సిమ్యులేషన్‌ మ్యాచ్​లో బాగా ఆడుతున్నాడు'

Shubman Gill
Shubman Gill (Getty Images)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Shubman Gill Injury Update : ఆస్ట్రేలియాలోని పెర్త్‌ వేదికగా నవంబర్ 22 నుంచి జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియాకు శుభ్​మన్​ గిల్ గాయం ఓ పెద్ద షాక్​నిచ్చింది. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతడి ఎడమ చేతికి గాయమవ్వగా, ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో రెండవ రోజు మైదానానికి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే శుభ్‌మన్ ఫిట్​నెస్​పై టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా ఓ కీలక సమాచారాన్ని అందించారు.

"శుభ్‌మన్‌ గిల్‌ గాయం నుంచి కోలుకుంటున్నాడు. బీసీసీఐ డాక్టర్ల బృందం అతడ్ని నిశితంగా పరిశీలిస్తోంది. అయితే మ్యాచ్​లో తనను ఆడించటంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. తొలి టెస్టు ఉదయమే గిల్‌ ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటాం. మ్యాచ్‌ ప్రాక్టీస్‌లో గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఆడాడు. అతడి విషయంలో మేము సానుకూలంగానే ఉన్నాం. ఇక మా దృష్టంతా షమీపైనే ఉంది. దాదాపు ఏడాది నుంచి అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడలేదు. అతడు కమ్​బ్యాక్ ఇస్తే మాత్రం ఇది గొప్ప విజయమే అవుతుంది. షమీకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌. దేశవాళీ క్రికెట్‌లోనూ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు" అని మోర్నీ పేర్కొన్నారు. అయితే, గిల్‌ను ఈ తొలి టెస్టు తుది జట్టులోకి తీసుకొచ్చే విషయంపై మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ఇక సిమ్యులేషన్ మ్యాచ్‌లో, గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి నవదీప్ సైనీ వేసిన బంతిని గల్లీ వద్ద క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగి 42 అజేయ పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్​కు దిగిన 14 మ్యాచ్‌లలో, గిల్ 42.09 సగటుతో 926 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు అలాగే మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి, ఇందులో అత్యధిక స్కోరు 119*. ఇక ఈ ఏడాది అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 19 ఇన్నింగ్స్‌లలో 47.41 సగటుతో 806 పరుగులు స్కోర్ చేశాడు.

కివీస్‌తో రెండో టెస్టులో పంత్ ఆడతాడా?, గిల్ పరిస్థితేంటి? - భారత అసిస్టెంట్​ కోచ్‌ రిప్లై ఇదే

శుభ్​మన్​ గిల్​తో డేటింగ్​ - అసలు విషయం బయట పెట్టిన అనన్య పాండే! - Ananya Pandey Shubman Gill

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details