Virat Kohli Comeback :ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు నమోదు చేసింది. యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (112 పరుగులు) సెంచరీతో అలరించగా, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (52 పరుగులు) కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత విరాట్ ఫామ్ అందుకోవడం వల్ల కింగ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.
విరాట్ కమ్‌బ్యాక్
విరాట్ ఎట్టకేలకు తన హాఫ్ సెంచరీతో విమర్శలకు సమాధానం ఇచ్చాడు. వన్డేల్లో అతడికి ఇది 73వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత తాజా మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. రెండో వికెట్‌కు గిల్‌తో కలిసి కీలకమైన 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫార్లు, 1 సిక్సు ఉంది.
సరైన సమయంలో
కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు విరాట్ వైట్‌బాల్ ఫార్మాట్లో కమ్‌బ్యాక్ ఇవ్వడం భారత్‌కు శుభసూచికం. గత మ్యాచ్‌లో కెప్టెన్ సెంచరీతో అలరించగా, తాజాగా విరాట్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్‌తో సీనియర్లిద్దరూ టచ్‌లోకి రావడంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందం షేర్ చేసుకుంటున్నారు.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ పోస్ట్ షేర్ చేసింది. 'కింగ్ ఈజ్ బ్యాక్' అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఓపెనర్ రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హాట్‌స్టార్ వ్యూవర్స్ సంఖ్య 80 లక్షలుగా ఉంది. కోహ్లీ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా 1.9 కోట్లకు చేరుకుందని ఓ ఫ్యాన్ పోస్ట్ చేశాడు.