తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPLలో రప్ఫాడిస్తున్న 'దూబే'- హార్దిక్ టీమ్ఇండియా ప్లేస్​​పై ఎఫెక్ట్? - Shivam Dube IPL 2024 - SHIVAM DUBE IPL 2024

పాపులర్‌ నేమ్స్‌ కాదు, ప్లేయర్‌ ఫామ్‌ని చూసి టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ సెలెక్ట్‌ చేయాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న శివమ్‌ దూబేకి బెర్త్‌ కన్‌ఫర్మ్‌ చేయాలని కోరుతున్నారు. ఇక హార్దిక్‌, సూర్య కుమార్‌, పంత్‌, అయ్యర్‌కి కష్టాలు తప్పవా?

Shivam Dube IPL 2024
Shivam Dube IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 8:17 PM IST

Shivam Dube IPL 2024:2024 టీ20 వరల్డ్​కప్​ జట్టు ఎంపికకు ప్రస్తుత ఐపీఎల్​ ప్రభావం చూపనుంది. దీంతో ఎలాగైనా పొట్టి ప్రపంచకప్​ టీమ్ఇండియా జట్టులో స్థానం సాధించాలని లక్ష్యంగా పలువురు యంగ్ క్రికెటర్లు రాణిస్తున్నారు. ఇప్పటికే కొందరి పేర్లు కచ్చితంగా టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉంటాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న పేరు శివమ్‌ దూబే.

ప్రస్తుతం సంచలన ప్రదర్శనలకు శివమ్‌ దూబే కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. 2024 ఐపీఎల్​లో దూబే 4 మ్యాచ్‌ల్లో 160+ స్ట్రైక్ రేట్‌తో 148 పరుగులు చేశాడు. రీసెంట్​గా సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఈ చెన్నై ప్లేయర్‌ 24 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. హైదరాబాద్‌ లాంటి స్లో పిచ్‌పైన కూడా దూబే ఇన్నింగ్స్‌ అతడి పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌ స్థాయిని తెలియజేసింది. దీంతో దూబేను వరల్డ్‌ కప్​నకు ఎంపిక చేయాలని క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కోరుతున్నారు.

అయితే దూబే రాణించడం వల్ల టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్య స్థానం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్​తోపాటు నాణ్యమైన బౌలింగ్​ చేయగల దూబే టీ20 జట్టు ఎంపికలో హార్దిక్ కంటే ముందు ప్రాధాన్యతలో ఉండే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు ప్రస్తుత టోర్నీలో కెప్టెన్సీతోపాటు, బ్యాటింగ్​లోనూ విఫలమవుతున్న పాండ్య విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. చూడాలి మరి రానున్న మ్యాచ్​ల్లోనైనా పాండ్య ఫామ్ అందుకుంటాడో లేదో!

సూర్యకుమార్, హార్దిక్​కు పోటీ
క్రికెట్ దిగ్గజాలు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రాబోయే T20 ప్రపంచకప్‌నకు శివమ్ దూబేను సెలక్ట్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. యువరాజ్ సింగ్​ దూబేని గేమ్- ఛేంజర్‌గా పేర్కొన్నాడు. ఐపీఎల్​లో దూబే స్థిరంగా రాణించడం, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్య వంటి వాళ్ల అవకాశాలను తగ్గిస్తుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 'శివమ్ దూబే ఆటతీరును చూసి, టీ 20 వరల్డ్‌ కప్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేయాలని ముందే చెప్పాను. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ వంటి ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. వాళ్లు ఇప్పుడు వరల్డ్​కప్‌ టీమ్‌లో చోటు దక్కాలంటే కచ్చితంగా నిలకడగా పరుగులు చేయాలి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను వరల్డ్‌కప్‌కి సెలక్ట్‌ చేయాలి' అని చెప్పాడు.

చెన్నై ఓడినా శివమ్ దూబె ధమాకా ఇన్నింగ్స్​ - సిక్సర్ల మోత! - IPL 2024 Sunrisers VS CSK

శివమ్, అంజూల జర్నీ - ఓ హిందూ ముస్లిం ప్రేమ కథ - Shivam Dube Love Story

ABOUT THE AUTHOR

...view details