Shami Comeback :టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో సెలక్టర్లు షమీకి చోటు కల్పించారు. కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వంలో, 15మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఇక 2023 వరల్డ్‌కప్‌లో గాయపడ్డ షమీ ఆ తర్వాత టీమ్ఇండియాకు దూరమయ్యాడు. కొంత కాలం ఎన్సీఏలో కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించనందున సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇక ఇటీవల కాలంలో షమీ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హరారే టోర్నీల్లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో షమీ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడింది. కాగా, దాదాపు 14నెలల తర్వాత షమీ ఈ సిరీస్‌తో టీమ్ఇండియా తరపున బరిలోకి దిగనున్నాడు.
మళ్లీ నిరాశే
యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. ఈ సిరీస్‌తో అయినా టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. 2023 డిసెంబర్లో ఇషాన్ కిషన్ టీమ్ఇండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇక 2025 ఐపీఎల్‌కు గాను అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో రూ.11.40 కోట్లకు కొనుగోలు చేసింది.
వాళ్లకూ నో ఛాన్స్
స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్, శివమ్ దూబేను కూడా సెలక్టర్లు దూరం పెట్టారు. పంత్ స్థానంలో శాంసన్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్లుగా ఎంపిక అయ్యారు. ఇక దూబేకు బదులుగా ఇటీవల బోర్డర్ గావస్కర్లో అదరగొట్టిన తెలుగు తేజం నితీశ్ రెడ్డివైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది.