Sachin Tendulkar 1993 Hero Cup : ప్రపంచ క్రికెట్లో భారత్‌కు సచిన్ తెందూల్కర్ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. టీమ్ ఇండియా తరఫున వేల పరుగులు, ఎన్నో వికెట్లు తీశాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చాలా సందర్భాల్లో బ్యాటుతో, బంతితో ప్రత్యర్థులను వణికించాడు. అలానే కొన్ని మ్యాచుల్లో విఫలమ్యాడు కూడా. అయితే ఒక మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో విఫలమైనప్పటికీ ఆ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. అదెలా అంటే?
ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే? - ఈ మ్యాచ్ వివరాలు తెలుసుకునేందుకు మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. 1993లో కోల్‌కతా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన హీరో కప్ సెమీఫైనల్లో ఈ సంఘటన చోటు చేసుకొంది. టీమ్ఇండియా మొదట 195 పరుగులు చేసింది. ఇందులో మహ్మద్ అజారుద్దీన్ 90 పరుగులతో అదరగొట్టాడు. కానీ సచిన్ మాత్రం కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో 49 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 190/8. చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉండగా, విజయానికి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు అజారుద్దీన్ ఊహించని విధంగా సచిన్‌కు బౌలింగ్ ఇచ్చాడు. అప్పటికి యంగ్ ప్లేయర్ సచిన్ మ్యాచ్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. అలాంటి సచిన్‌పై పెద్ద బాధ్యత పడింది.