Sachin ODI Double Century : క్రికెట్ లవర్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మూమెంట్స్ హిస్టరీలో చాలానే ఉన్నాయి. అయితే అందులో ఫిబ్రవరి 24కి మాత్రం మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకుంటే సరిగ్గా 14 ఏళ్ల క్రితం భారత జట్టు మాజీ ప్లేయర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేలో ఓ ఘనతను సాధించాడు. అదేంటంటే ?
2010, 24 ఫిబ్రవరి న గ్వాలియర్ వేదికగా సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్ జరిగింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో సచిన్ ద్విశతకం బాది రికార్డుకెక్కాడు. దిగ్గజ ప్లేయర్‌కు ఇదంతా కామనే కదా అని అనుకుంటే మీరు పొరబడట్లే. సుమారు 37 ఏళ్ల వయసులో సచిన్ ఈ రికార్డును అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మ్యాచ్ సాగిందిలా :
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్, ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మైదానంలోకి దిగాడు. అయితే ఎన్నో ఆశల నడుమ ఆయన క్రీజుల్లోకి రాగా, కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. పార్నెల్ బౌలింగ్‌లో స్టెయిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్‌తో కలిసి సచిన్ జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఈ ద్వయం తమ పార్ట్నర్షిప్లో రెండో వికెట్ సమయానికి 194 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. 79 పరుగులు మాత్రమే చేయగలిగిన దినేశ్, 34వ ఓవర్‌లో అనుహ్యంగా ఔటయ్యాడు.