Rohit Sharma Virat Kohli International Ducks :టీమ్ఇండియాకు గత 15 ఏళ్లుగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎనలేని సేవలు అందిస్తున్నారు. చాలా మ్యాచుల్లో ఈ దిగ్గజ ద్వయం ఒంటిచేత్తో భారత జట్టుకు విజయాన్ని అందించింది. టీమ్ఇండియాకు ప్రస్తుతం ఉన్న స్టార్ బ్యాటర్ల లిస్ట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా వీరిద్దరూ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఇప్పటికీ అదరగొడుతున్నారు. అయితే ఈ ఇద్దరి పేర్లు ఓ చెత్త రికార్డులోనూ టాప్ లిస్ట్‌లో ఉంది. అదేంటంటే?
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లీ 53.18 సగటుతో అన్ని ఫార్మాట్లలో కలిపి 27వేలకు పైగా పరుగులు చేశాడు. 2007లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్, 43.15 సగటుతో 19,250కి పైగా రన్స్ సాధించాడు. అయితే వీరిద్దరూ తమ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా, కొన్ని సార్లు విఫలమయ్యారు. ఇప్పటివరకూ ఈ ద్వయం అన్నీ ఫార్మాట్లో ఎన్ని డక్స్ను నమోదు చేసిందో తెలుసా?
కోహ్లీ, రోహిత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 33, అలాగే 37 సార్లు డకౌట్ అయ్యాడు. 103 టెస్టుల్లో ఐదు, 257 వన్డేల్లో 16, 151 టీ20ల్లో 12 సార్లు రోహిత్ డకౌట్ అవ్వగా, విరాట్ కోహ్లీ 193 టెస్టుల్లో 14 డక్‌లు, 283 వన్డేల్లో 16, 125 టీ20ల్లో ఏడుసార్లు సున్నాకే ఔట్ అయ్యాడు. అయితే ఈ లిస్ట్‌లో వీరికంటే ముందు మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ టాప్‌లో ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ 44 సార్లు డకౌట్ అయ్యారు.