Rohit Sharma T20 World Cup :మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సంసిద్ధమవుతోంది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి పోరుకు సిద్ధంగా ఉంది. అయితే మ్యాచ్‌కు ముందుశనివారం బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అసలైన అందులో భాగంగా తాజాగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీతో మాట్లాడాడు. తమ ప్రాక్టీస్ సెషన్‌తో పాటు ఈ మ్యాచ్‌కు సంబంధించిన పలు అంశాల గురించి చెప్పుకొచ్చాడు. వార్మప్ మ్యాచ్ కూడా తమకు చాలా ముఖ్యమని, ఇక్కడి పరిస్థితులకు వాళ్లు అలవాటుపడేందుకు ఈ వార్మప్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకుంటామని వ్యాఖ్యానించాడు.
"టోర్నీ మొదలయ్యేందుకు ముందే ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులకు మేము అలవాటు పడాల్సి ఉంది. ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి. అందుకే మాకు వార్మప్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. బ్యాటర్లు, బౌలర్లు తమ లయను అందిపుచ్చుకోవడానికి కూడా ఈ మ్యాచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మేము మా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి సన్నాహకంగానే ఈ వార్మప్‌లను వాడుకుంటాం. నెట్స్‌లో తీవ్ర ప్రాక్టీస్ తర్వాత న్యూయార్క్ అందాలను వీక్షించే అవకాశం మాకు దక్కింది. ఈ వేదిక కూడా చాలా బాగుంది. ఇది ఓ ఓపెన్ గ్రౌండ్. ఇలాంటి స్టేడియంలో ఆడేందుకు మా టీమ్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. తప్పకుండా భారీఎత్తున అభిమానులు క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.