తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 వరల్డ్​ కప్​నకు అతడి అవసరం ఎంతో ఉంది - రోహిత్ అలాంటి కెప్టెన్​' - Rohit Sharma T20 World Cup - ROHIT SHARMA T20 WORLD CUP

Rohit Sharma T20 World Cup 2024 : రానున్న టీ20 ప్రపంచకప్‌నకు స్టార్ క్రికెటర్​ రోహిత్‌ శర్మ ఎంతో అవసరమంటూ టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు. అతడు ఓ తెలివైన కెప్టెన్‌ అంటూ హిట్​మ్యాన్​ను కొనియాడాడు.

Rohit Sharma T20 World Cup 2024
Rohit Sharma (Source : Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 4:20 PM IST

Rohit Sharma T20 World Cup 2024 :ఐపీఎల్ ఫీవర్ ముగియనున్న తరుణంలో టీమ్ఇండియా మరో పోరుకు సంసిద్ధం కానుంది. జూన్​లో ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు కూర్పుపై పలు ప్రశంసలతో పాటు విమర్మలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మపై మాజీ ప్లేయర్ యువరాజ్‌ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రానున్న టీ20 వరల్డ్​ కప్​లో రోహిత్‌ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని, అతడు ఓ తెలివైన కెప్టెన్‌ అంటూ హిట్​మ్యాన్​ను కొనియాడాడు. ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

"రోహిత్ శర్మ ఈ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండటం ఎంతో కీలకం. ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకునే తెలివైన కెప్టెన్ మనకు ఎంతో అవసరం. రోహిత్​కు అటువంటి సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉంది. ఓ కెప్టెన్‌గా అతడు ఇప్పటికే ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలను జట్టుకు అందించాడు. అతడి సారథ్యంలో టీమ్ఇండియా 2023 వన్డే ప్రపంచ కప్‌లోనూ అద్భుతంగా ఆట తీరుతో ఫైనల్‌కు చేరింది. టీమ్​ఇండియాకు కెప్టెన్‌గా రోహిత్‌ లాంటి ఓ ప్లేయర్ అవసరమని నా అభిప్రాయం. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ అతడి వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు రాలేదు. అదే రోహిత్ శర్మ బ్యూటీ. కో ప్లేయర్స్​తో ఎప్పుడూ సరదాగానే ఉంటాడు. మైదానంలో ఓ నాయకుడిగా ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. క్రికెట్‌లో నాకున్న అత్యంత ఆప్తమిత్రుల్లో రోహిత్ శర్మ ఒకడు. రోహిత్​ను వరల్డ్​ కప్​ ట్రోఫీతో చూడాలని నేను ఆశిస్తున్నాను. అతను నిజంగా దానికి అర్హుడు" అంటూ యువరాజ్ సింగ్ అన్నాడు.

ఇక కెరీర్‌ తొలినాళ్లలో రోహిత్ - యువరాజ్‌ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ మంచి మిత్రులుగా మారారు. 2007లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో యువీ, రోహిత్‌ కూడా మెంబర్స్​గా ఉన్నారు.

రోహిత్‌కు ఏమైంది? - కలవరపెడుతున్న హిట్ మ్యాన్ ఫామ్! - IPL 2024 Rohit sharma

'8 ఏళ్ల వయసు నుంచే నా ఇన్​స్పిరేషన్​ - ఆయన్ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను' - Rohit Sharma Inspiration

ABOUT THE AUTHOR

...view details