తెలంగాణ

telangana

ETV Bharat / sports

అశ్విన్ రిటైర్మెంట్​పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు - ROHITH ON ASHWIN RETIREMENT

'అశ్విన్ రిటైర్మెంట్ నాకు ముందే తెలుసు - అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాడేమో!' - రోహిత్ శర్మ

Rohith On Ashwin Retirement
Rohith On Ashwin Retirement (source ANI and Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 18, 2024, 4:48 PM IST

Rohith On Ashwin Retirement : టీమ్ ఇండియా ఆల్​రౌండర్​ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్​పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. పెర్త్ టెస్టు సమయంలోనే అశ్విన్ రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అశ్విన్ ఆటకు గుడ్ బై చెప్పడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

'ఆయన వ్యక్తిగతం- దాన్ని గౌరవిస్తాం'

"నేను పెర్త్​కు వచ్చినప్పుడు అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి చెప్పాడు. నేను అతడిని కనీసం పింక్‌ బాల్ టెస్టులో ఆడాలని ఒప్పించాను. రిటైర్మెంట్ విషయంలో అశ్విన్ తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం. దానిని గౌరవిస్తాం. అన్నింటికీ అశ్వినే సమాధానం ఇస్తాడు. జట్టుకు ఏది అవసరమో అశ్విన్​కు తెలుసు. మేం ఎలాంటి కాంబినేషన్‌ ఆలోచిస్తున్నామనే దానిపైనా అశ్విన్​కు అవగాహన ఉంది. తనకు ఛాన్స్ రానప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పేస్తే బాగుంటుందని అని అశ్విన్ అనుకొని ఉండొచ్చు." అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

'అశ్విన్ తో ప్రయాణంలో ఎన్నో అనుభవాలు'

అశ్విన్‌తో కలిసి చాలా క్రికెట్‌ ఆడానని రోహిత్ తెలిపాడు. అండర్ -17 స్థాయి నుంచి అశ్విన్ తెలుసని, తొలుత ఓపెనర్​గా వచ్చేవాడని పేర్కొన్నాడు. "చాలా రోజులు మాయమైపోయాడు. కొన్నేళ్లకు తమిళనాడు తరఫున ఓ బౌలర్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడని విన్నాను. తీరా చూస్తే ఆ 5 వికెట్ హాల్ తీసింది అశ్వినే. బ్యాటర్‌గా వచ్చిన అతడు బౌలర్‌గా ఎలా మారిపోయాడని అని ఆశ్చర్యపోయాను. మేం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం పాటు కలిసి ఆడాం. అతడితో ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. జట్టు విజయాల్లో ఆశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆటకు గుడ్ బై చెప్పాడు." అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

రాబోయే తరాలు నీ గురించి చెప్పుకుంటాయ్!

"ఒక యువ బౌలర్‌ నుంచి ఆధునిక క్రికెట్‌ లెజెండ్​గా నువ్వు ఎదిగిన తీరును దగ్గరుండి చూశా. దాన్ని నేను ప్రపంచానికి చెప్పలేకపోవచ్చు. కానీ, అశ్విన్​ను చూసే నేను బౌలర్‌గా మారానని రాబోయే తరాల బౌలర్లు తప్పకుండా చెబుతారని నాకు తెలుసు"

- టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌

'మీ తదుపరి అధ్యాయానికి ఆల్ ది బెస్ట్ అశ్విన్'

అశ్విన్ మీ అద్భుతమైన క్రికెట్ ప్రయాణానికి అభినందనలు. మీరు బౌలింగ్​లో స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నీరసపడిన క్షణం లేదు. మీ తదుపరి అధ్యాయానికి ఆల్ ది బెస్ట్!

-- అజింక్యా రహానే, క్రికెటర్

యాష్ భారత క్రికెట్​కు మీరు ఎనలేని సేవలు అందించారు. మీ అంకితభావం, సహకారం, సుదీర్ఘ కాలం పాటు గుర్తుండిపోతుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ వ్యక్తులలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోతారు.

-- ఛతేశ్వర్ పుజారా, టీమ్ ఇండియా క్రికెటర్

గోట్​గా అభివర్ణించిన కార్తీక్

అలాగే అశ్విన్​ను టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రశంసలతో ముంచెత్తారు. యాష్ ను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)గా అభివర్ణించారు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్! - రిటైర్మెంట్​ తర్వాత అశ్విన్ ఏ పొజిషన్​లో ఉన్నాడంటే?

గబ్బాలో గట్టెక్కాం- మరి భారత్ WTC ఫైనల్ సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details