Rohit Sharma Reverse Sweep: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రీసెంట్గా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 8 సిక్స్‌లు సహా, 121* పరుగులు బాదాడు. అయితే అఫ్గాన్ స్పిన్నర్ షరాఫుద్దిన్ అష్రఫ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడాడు. దీంతో బంతి స్టాండ్స్‌లో (సిక్స్)కి వెళ్లింది. ఈ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
అయితే ఈ షాట్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ ఎబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాగా బాదాడంటూ సోషల్ మీడియాలో రోహిత్‌పై ప్రశంసలు కురిశాయి. అయితే తాను రివర్స్ స్వీప్ ఆడడంపై రోహిత్ స్పందించాడు. అలా స్విచ్ షాట్లు ఆడేందుకు ఎంతో కాలం నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పాడు. అలాంటి షాట్లు బాదడం వల్ల ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టవచ్చని రోహిత్ పేర్కొన్నాడు.
'నేను ఈ షాట్ ఆడేందుకు గత రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలంటే ఇలాంటి షాట్స్ ఆడాల్సి ఉంటుంది. బంతి తిరుగుతున్నప్పుడు స్ట్రయిట్ షాట్స్ ఆడలేం. అలాంటప్పుడు కొత్తగా ప్రయత్నించాలి. టెస్టుల్లోనూ ఒకటి, రెండు సార్లు నేను ఈ షాట్ కొట్టేందుకు ట్రై చేశా' అని రోహిత్ అన్నాడు.