తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 5:26 PM IST

Updated : Mar 9, 2024, 6:24 PM IST

ETV Bharat / sports

రోహిత్ రిటైర్మెంట్ ప్లాన్ రివీల్- ​2024 IPLకూ దూరం!

Rohit Sharma Retirement: టీమ్ఇండియా రోహిత్ శర్మ ప్రస్తుతం కెరీర్​లో సూపర్ ఫామ్​లో దూసుకుపోతున్నాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్​లోనూ తన మార్క్ కనబరుస్తున్నాజు. అయితే రీసెంట్​గా రోహిత్​కు రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తాను ఆటకు గుడ్​బై చెప్పే రోజు గురించి చెప్పాడు.

Rohit Sharma Retirement
Rohit Sharma Retirement

Rohit Sharma Retirement: భారత్ స్వదేశంలో ఇంగ్లాండ్​తో ఆడిన టెస్టు సిరీస్​ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​లో ఓడినప్పటికీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్​ల్లో నెగ్గి, ఒక టెస్టు మిగిలుండగానే సిరీస్ దక్కించుకుంది. తాజాగా ధర్మశాలలో జరిగిన నామమాత్రపు ఐదో టెస్టులో ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా మూడు రోజుల్లోనే మ్యాచ్​ను ముగించింది. ఇక ఈ మ్యాచ్​ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్​ దినేశ్ కార్తిక్​తో కలిసి జియో సినిమా చిట్​చాట్​లో పాల్గొన్నాడు. ఈ చిట్​చాట్​లో రోహిత్ రిటైర్మెంట్ ప్రస్తావన రాగానే అతడు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు.

'ఎప్పుడైతే నిద్రలో నుంచి లేవగానే క్రికెట్ ఆడే పరిస్థితిలోలేను అని నాకు అనిపిస్తే ఆ రోజే ఆటకు గుడ్​బై చెప్పేస్తా. కానీ, గత రెండు మూడేళ్లుగా నా ఆట అత్యుత్తమంగా ఉంది. ప్రస్తుతం నేను నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నా' అని రోహిత్ అన్నాడు. ఈ వీడియో చూసిన రోహిత్ ఫ్యాన్స్, 'హిట్​మ్యాన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. ఇంకో మూడేళ్ల దాకా క్రికెట్ ఆడే సత్తా అతడిలో ఉంది' అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్​కు దూరం!:ఇక ధర్మశాల టెస్టులో రోహిత్ గాయపడ్డాడు. వెన్నునొప్పి బాధతో మూడో రోజు బరిలోకి దిగలేదు. ఆతడి స్థానంలో పేసర్ జస్ప్రత్ బుమ్రా జట్టును నడిపించాడు. ఇక టీమ్ఇండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్​లు ఏమీ లేవు. జూన్​లో నేరుగా టీ20 వరల్డ్​కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి వెస్టిండీస్, యూఎస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే పొట్టికప్ టోర్నీ దృష్యా రోహిత్ 2024 ఐపీఎల్​కు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్​మెంట్​కు కూడా సమాచారం ఇచ్చాడట. ఇక త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. ఇక మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్​- రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మ్యాచ్​తో ఐపీఎల్​ సీజన్- 17 ప్రారంభం కానుంది.

రోహిత్, గిల్ సెంచరీల మోత- భారీ స్కోర్ దిశగా భారత్

ఇంగ్లాండ్​తో ఐదో మ్యాచ్​ - రోహిత్, యశస్వి, కుల్దీప్​ రికార్డులే రికార్డులు

Last Updated : Mar 9, 2024, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details