తెలంగాణ

telangana

ETV Bharat / sports

'8 ఏళ్ల వయసు నుంచే నా ఇన్​స్పిరేషన్​ - ఆయన్ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను' - Rohit Sharma Inspiration - ROHIT SHARMA INSPIRATION

Rohit Sharma Inspiration : తన ఆటతీరుతో ఎంతో మంది యూత్​ను ఇన్​స్పిరేషన్​గా నిలుస్తున్నాడు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ. అయితే రోహిత్​కు ఇన్​స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి ఒక్కరు ఉన్నారట. ఇంతకీ ఆయన ఎవరంటే?

Rohit Sharma Birthday Special
Rohit Sharma Birthday Special

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 1:16 PM IST

Rohit Sharma Inspiration :టీమ్ఇండియాలో ఓ వెలుగు వెలుగుతున్న సక్సెస్​ఫుల్ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకరు. తన బ్యాటింగ్ స్కిల్స్​తో అభిమానులను ఆకట్టుకునే ఈ స్టార్ క్రికెటర్ తన కెప్టెన్సీలో టీమ్​ఇండియాకు ఎన్నో మర్చిపోలేని విజయాలను అందించాడు. అందుకే ఎంతో మంది యువ ఆటగాళ్ళు రోహిత్​ను స్పూర్తిగా తీసుకుంటారు. అయితే రోహిత్​కి ఇన్స్​పిరేషన్ ఎవరో తెలుసా? ఇంకెవరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ విషయాన్ని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు.

ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రోహిత్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. తనకు ఎనిమిది తొమ్మిదేళ్లు ఉన్నప్పటి నుంచి సచిన్‌ ఆటను చూస్తూనే ఉన్నానన్న రోహిత్ దాదాపు పాతికేళ్లపాటు దేశం కోసం బాధ్యతాయుతమైన ప్రవర్తనతో జట్టును తన భుజాలపై మోసిన సారధిగా సచిన్​ను తను ఎప్పటికీ ఆరాధిస్తానన్నాడు. అసలు కెరీరపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా సచిన్‌ ఎలా ఉన్నాడనే దానిని తను ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉంటానని చెప్పాడు. క్రికెట్‌ దిగ్గజంగా పేరుగాంచిన ఒక వ్యక్తి ఈ విధంగా వినయ విధేయలతో ఉండటం చాలా కష్టం. దానిని సాధ్యం చేసి చూపించిన క్రికెటర్‌ సచిన్‌ అంటూ కొనియాడాడు. సచిన్‌ తన కెరీర్‌లో సాధించిన అద్భుతాలను తానెంతో దగ్గరి నుంచి చూశానన్న రోహిత్, అసలు అన్ని సంవత్సరాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సాధారణ విషయం కాదన్నాడు.

2007లో రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం ఐసీసీ T20 వరల్డ్ కప్ 2007లో రోహిత్ పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 16 బంతుల్లో 30* పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అప్పటి నుంచే విధ్వంసక యంగ్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో మొదటి ఆరేళ్ల పాటు మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. అయితే 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటిసారి శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి రోహిత్‌ కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పైకి లేచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో 35.40 యావరేజ్‌తో 177 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

వన్డేల్లో హిట్​మ్యాన్ వరల్డ్​ రికార్డ్ - పదేళ్లైనా ఇంకా చెరగలేదు - Rohit Sharma Birthday

'అదంతా ఫేక్- నేను అలా అనలేదు'- రోహిత్​పై వ్యాఖ్యలపై ప్రీతీ క్లారిటీ - IPL 2024

ABOUT THE AUTHOR

...view details