Rohit Sharma Nagin Dance :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ అభిమానులతో చాలా సరదాగా ఉంటాడు. ఇటీవల ముంబయిలో ఓ అభిమాని కోసం తన కారును రోడ్డుపై ఆపి మరీ ఫొటో దిగాడు. ఈ క్రమంలో ఆ అభిమాని పుట్టినరోజు అని పక్కనున్నవారు చెప్పడంతో ఆమెకు రోహిత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ బర్త్ డే విషెస్ చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా రోహిత్ ఫ్యాన్స్‌కు మరిచిపోలేని జ్ఞాపకాలను ఇస్తుంటాడు. అయితే ఓ కామెడీ షోలో రోహిత్ లేడీ ఫ్యాన్‌తో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
లేడీ ఫ్యాన్‌తో రోహిత్ నాగిన్ డ్యాన్స్
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన కొందరు భారత ఆటగాళ్లతో కలిసి ఇటీవల రోహిత్ శర్మ ఓ కామెడీ షోకు హాజరయ్యాడు. ఆ షోలో పాల్గొన్న ఓ లేడీ ఫ్యాన్ అభిమాని తనతో స్టెప్పులు వేయమని రోహిత్ ను కోరింది. అయితే తొలుత రోహిత్ అందుకు నిరాకరించాడు. ఆ తర్వాత అభిమాని కోరిక మేరకు నాగిన్ డ్యాన్స్ వేశాడు. ఆ సమయంలో ప్రేక్షకుల మధ్య రోహిత్ భార్య రితిక కూడా ఉంది. ఆమె కూడా మెల్లగా రోహిత్ డ్యాన్స్ ను చూసి నవ్వుకుంది. కామెడీ షోలో రోహిత్ అభిమానితో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ క్లిప్‌ను ఆ కామెడీ షోలో ప్రసారం చేయలేదట.
ఫ్యాన్స్ షాక్
అయితే ఈ వైరల్ వీడియో క్లిప్ చూసిన రోహిత్ అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ సహా టీమ్ఇండియా క్రికెటర్లు పాల్గొన్న ఆ కామెడీ షోను చూశామని కానీ, ఎక్కడా రోహిత్ నాగిన్ డ్యాన్స్ క్లిప్ కనిపించలేదని పోస్టులు పెడుతున్నారు.