Rohit Sharma vs Mitchell Starc:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఇందులో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో 5 సిక్స్‌లు బాదాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో స్టార్క్‌పై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. కాగా, ఈ ట్రోల్స్ ఇప్పుడు అమెరికా దాకా వెళ్లాయి.
డాలస్‌లో ఓ స్పోర్ట్స్ అకాడమీ ప్రారభించడానికి రోహిత్ రీసెంట్గా అమెరికా వెళ్లాడు. ఈ ఓపెనింగ్ ఈవెంట్లో రోహిత్ స్టేజ్‌పై మాట్లాడుతుండగా అక్కడున్న ఫ్యాన్స్ 'మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్' అంటూ ఆసీస్ పేసర్‌ను ఓ లెవల్లో ర్యాగింగ్ చేశారు. దీంతో రోహిత్ నవ్వతూ 'కామ్ డౌన్ గాయ్స్' అని ఆన్సర్ ఇచ్చాడు. అంతే ఒక్కసారిగా ఈవెంట్లో నవ్వులే నవ్వులు. కాగా, ఆ మ్యాచ్‌లో రోహిత్ 41 బంతుల్లోనే 92 పరుగులు బాది ఆసీస్ బౌలర్లనుతో ఊచకోత కోశాడు. ఇందులో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్లో 29 పరుగులు బాదాడు. ఇక ఈ టోర్నీలో రోహిత్ 257 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.