Rohit Sharma Border Gavaskar Trophy :స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఘోరంగా 0-3 తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే టీమ్ఇండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రాణించాల్సిందే. అప్పుడే భారత జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా భారత్‌పై కివీస్ మూడు టెస్టులను గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలిచింది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఆడుతాడా?
అలాగే న్యూజిలాండ్ జరిగిన సిరీస్‌లో కివీస్‌పై వైట్‌వాష్ కావడం వల్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో రోహిత్ శర్మ ఆడుతాడో? లేదో? అనే అనుమానాలు కూడా క్రీడాభిమానులకు వస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత కారణాల వల్ల, ఆసీస్ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉంటాడని ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే కివీస్‌తో ఘోర వైఫల్యం తర్వాత రోహిత్ ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాదా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లోనూ రోహిత్ ఈ విషయంపై మాట్లాడాడు. ఆసీస్‌కు వెళ్తానో లేదో అని చెప్పుుకొచ్చాడు.
ఘోరంగా విఫలమైన రోహిత్
తాజాగా కివీస్‌తో జరిగిన మూడో టెస్టులోనూ టీమ్ ఇండియా చాపచుట్టేసింది. దీంతో 25పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అర్ధశతకంతో రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. 147 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ దిగిన భారత జట్టు ఆది నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఎవరు రాణించలేదు. ఈ క్రమంలో టీమ్ఇండియా 121 రన్స్‌కే కుప్పకూలింది.