తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ అభిమానులకు షాక్! - బోర్డర్​ గావస్కర్ ట్రోఫీ తర్వాత హిట్​మ్యాన్ టెస్ట్​ కెరీర్ ముగిసేనా!? - ROHIT SHARMA BORDER GAVASKAR TROPHY

బోర్డర్​ గావస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్‌ దారెటు? - సందిగ్ధంలో అభిమానులు

Rohit Sharma Border Gavaskar Trophy
Rohit Sharma (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 4, 2025, 7:26 AM IST

Rohit Sharma Border Gavaskar Trophy : ఆస్ట్రేలియా టూర్​లో మ్యాచ్‌ రిజల్ట్​ కంటే ప్లేయర్ల రిటైర్మెంట్​ అనౌన్స్​మెంట్లు క్రీడా అభిమానులను కలవరపరుస్తోంది. మూడో టెస్టు తర్వాత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ టెస్ట్ ఫార్మాట్​కు వీడ్కోలు పలికి అందరినీ షాక్​కు గురి చేయగా, ఇప్పుడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. తాజాగా అతడు చివరి టెస్టు నుంచి తప్పుకున్నప్పటి నుంచి అందరూ దీని గురించే మాట్లాడకుంటున్నారు.

ఇదిలా ఉండగా, ఈ విషయంపై మాజీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ కేవలం ఒక మ్యాచ్‌కు దూరం కావట్లేదని, ఈ నిర్ణయం వెనక వేరే పెద్ద కారణం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్​లో ఫిట్‌గా ఉండి కూడా కెప్టెన్‌ తుది జట్టుకు దూరం కావడం అంటే అది ఆలోచించదగ్గ విషయమే అని అంటున్నారు.

అయితే రోహిత్‌ను జట్టు నుంచి తప్పించారా లేకుంటే అతనే తప్పుకొన్నాడా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్‌ స్థానంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన బుమ్రా మాత్రం టాస్‌ సమయంలో కెప్టెన్‌(రోహిత్) నిస్వార్థంగా ఆలోచించి, తనకు తానుగా జట్టు నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు.

కానీ తొలి రోజు ఆట తర్వాత రిషబ్‌ పంత్‌ మాత్రం ఈ విషయంపై వేరేలా స్పందించాడు. రోహిత్‌ తుది జట్టుకు దూరం కావడం అనేది భావోద్వేగంతో కూడుకున్నదని, అది జట్టు యాజమాన్యం నిర్ణయమని పంత్ పేర్కొన్నాడు. దీంతో రోహిత్‌ తనే తప్పుకొన్నా సరే అది జట్టు యాజమాన్యం ఒత్తిడి మేరకే అయ్యుంటుందని అందరూ భావిస్తున్నారు.

జట్టు యాజమాన్యంలో కెప్టెన్, వైస్‌ కెప్టెన్, కోచ్‌ భాగస్వాములుగా ఉంటారు. మరి బుమ్రా రోహిత్‌ను తప్పుకోమని చెప్పే సాహసం చేసి ఉండకపోవచ్చు. దీంతో గంభీర్‌ వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. మ్యాచ్‌కు ముందే రోహిత్‌ ఈ మ్యాచ్‌లో ఆడతాడా అని విలేకరులు అడిగితే దానికి అతడు సరైన సమాధానం చెప్పనపుడే అందరికీ అనుమానం వచ్చింది. అయితే ఇటువంటి సమయంలో కీలక మ్యాచ్‌ ముందు కెప్టెన్‌ను తప్పించడం అనేది జట్టు వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని, రోహిత్‌ లాంటి ఆటగాడికి ఇది అవమానమే అంటూ అభిమానులు టీమ్ఇండియా మేనేజ్​మెంట్​పై మండిపడుతున్నారు.

ఇక కెరీర్​ ముగిసినట్లేనా?
ప్రస్తుత సిరీస్‌లో రోహిత్‌ ఓ కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్​గానూ తీవ్ర నిరాశకు గురి చేశాడన్న మాట వాస్తవం. 3, 6, 10, 3, 9 ఇవీ సిరీస్‌లో అతడి​ స్కోర్లు. బుమ్రా సారధ్యంలో తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన జట్టు, రోహిత్‌ వచ్చాక అంతంతమాత్రంగానే పెర్ఫామె చేసింది. రెండు టెస్టుల్లో ఓటమి, వర్షం వల్ల ఒక మ్యాచ్‌లో డ్రాతో ముగిసింది. అయితే చివరి టెస్టులో తన పెర్ఫామెన్స్, మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నప్పటికీ సిరీస్‌ ముగిసిన తర్వాత రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్​ పలుకుతాడనే అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ తర్వాతి టెస్టుకు ఇంకో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది.

మరోవైపు సొంతగడ్డపై ఇంకో రెండు నెలలకు ఓ సిరీస్‌ ఉంటుంది. అప్పటిదాకా రోహిత్‌ కొనసాగడం కూడా కష్టమేనని క్రిటిక్స్ అంటున్నారు. ఇలా అనూహ్యంగా చివరి టెస్టుకు దూరమైన అతను, ఇక టెస్టు జట్టుతో ఎన్నో రోజులు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత, లేకుంటే మధ్యలోనే రోహిత్‌ రిటైర్మెంట్
అనౌన్స్​ చేస్తే ఆశ్చర్యం లేదని అంటున్నారు. అయితే వన్డేల విషయంలో అతడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏదేమైనప్పటికీ రోహిత్‌ లాంటి స్టార్ క్రికెటర్ ఇలా టెస్టు కెరీర్‌ను ముగిస్తుండటం క్రికెట్ అభిమానులకు తీవ్ర వేదన కలిగించే విషయమే.

'రెస్ట్ పేరు చెప్పి రోహిత్​ను కావాలనే తప్పించారు - ఏ కెప్టెన్ కూడా ఇలా చేయడు'

కోచ్‌ Vs కెప్టెన్‌ - అందుకే రోహిత్ ప్లేస్​లో బుమ్రా - 'ఆ ఆలోచన అప్పుడే వచ్చిందా?!'

ABOUT THE AUTHOR

...view details