Rohit Sharma Birthday Special :అతను జట్టు గెలుపుకోసం ముందుండి పోరాడుతాడు, ఆటోమేటిక్‌గా రికార్డులు అతని వెంట నడుస్తాయి. తనదైన రోజున సిక్సుల వర్షంతో వీక్షకులను ఫీల్డర్లుగా, ఫీల్డర్‌లను వీక్షకులుగా మార్చేస్తాడు. అటు సీనియర్‌లకు, ఇటు జూనియర్‌లకు, అందరి అభిమానులకు మోస్ట్ లవబుల్ ప్లేయర్. మీరు ఊహించింది నిజమే మనం మాట్లాడుకుంటోంది భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించే. ఈ ఏప్రిల్ 30న హిట్‌మ్యాన్ 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. రో పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్‌లోని అద్భుత విజయాలు, ఆసక్తికర అంశాలు పరిశీలిద్దాం.
ప్రస్తుత జనరేషన్‌లోని అత్యుత్తము బ్యాటర్‌లలో రోహిత్ శర్మ ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియాకి మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ తృటిలో చేజార్చుకున్న రోహిత్, ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ వేటకు సిద్ధమవుతున్నాడు.
2007లో రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం ఐసీసీ T20 వరల్డ్ కప్ 2007లో రోహిత్ పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 16 బంతుల్లో 30* పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అప్పటి నుంచే విధ్వంసక యంగ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో మొదటి ఆరేళ్ల పాటు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటిసారి శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి రోహిత్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పైకి లేచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో 35.40 యావరేజ్‌తో 177 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఓనెనర్‌గా మారిన తర్వాత రోహిత్ దూకుడు పెరిగింది. హిట్‌మ్యాన్ అనే బిరుదును పొందాడంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రోహిత్ 262 వన్డేల్లో 49.12 యావరేజ్‌తో 10709 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 264. వన్డే క్రికెట్ హిస్టరీలో ఇదే అత్యధిక స్కోరు. విరాట్ (50), సచిన్ (49) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ(3) డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ రోహిత్.