Rohit About Virat Fitness:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ తన కెరీర్లో ఫిట్నెస్ సమస్యలతో ఎప్పుడు కూడా ఎన్సీఏ (National Cricket Academy)కి వెళ్లలేదని పేర్కొన్నాడు. యంగ్ ప్లేయర్లు కూడా విరాట్ నుంచి చాలా నేర్చుకోవాలని చెప్పాడు. భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టుకు ముందు టీమ్ఇండియా మాజీ ప్లేయర్ దినేశ్ కార్తిక్‌తో ముచ్చటించిన రోహిక్ వ్యాఖ్యలు చేశాడు.
'విరాట్ తన కెరీర్లో ఇప్పటివరకూ ఫిట్నెస్ సమస్యలతో ఎన్సీఏకు వెళ్లలేదు. అతడి ఫిట్‌నెస్‌కు ఇదే నిదర్శనం. క్రికెట్ పట్ల అతడికి ఎంతో డెడికేషన్. ఎంత సాధించినా ఇంకా పరుగుల కోసం తపిస్తాడు. యంగ్ ప్లేయర్లు అతడి నుంచి ఇది నేర్చుకోవాలి. కవర్ డ్రైవ్, ఫ్లిక్, కట్ షాట్లు ఎలా ఆడుతున్నాడో చూడాలి. విరాట్ ఇప్పటికే కెరీర్లో ఎంతో సాధించాడు. అతడు దీనికే సంతృప్తి పడవచ్చు. 2- 3 సిరీస్‌లు ఆడకపోయినా ఫర్వాలేదు అని అతడు అనుకోవచ్చు. కానీ, విరాట్ పరుగుల దాహం తీరనిది. టీమ్ఇండియాకు ఆడడాన్ని గర్వంగా ఫీల్ అవుతాడు. యువ ఆటగాళ్లు కూడా ఇది నేర్చుకోవాలి' అని రోహిత్ అన్నాడు.