Rishabh Pant IPL 2025 :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాడు. 2025 ఐపీఎల్ కోసం తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీతో చర్చలు జరిపాడని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే దీన్ని పంత్ ఖండించాడు. అదంతా అవాస్తవం అని, ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని కోరాడు.
ట్వీట్లో ఏముందంటే?
'రిషభ్ పంత్ తన మేనేజర్ ద్వారా వారం కిందట ఆర్సీబీ మేనేజ్మెంట్తో సంప్రదింపులు జరిపాడు. ఆర్సీబీలో కెప్టెన్సీ స్థానం ఆశించాడు. కానీ, ఆర్సీబీలోకి పంత్ రావడం విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని, అందుకే జట్టు మేనేజ్మెంట్ పంత్ రాకను తిరస్కరించింది' అని పోస్ట్‌లో సదరు నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి పంత్ ఘాటుగా స్పందించి రిప్లై ఇచ్చాడు. 'ఇది ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తారు. తెవిగలవారు ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయరు. ఎటువంటి సమాచారం లేకుండా తప్పుడు వార్తలను సృష్టించవద్దు. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేయడం ఇదే మొదటిసారి కాదు, ఆఖరిసారి కాదు. అందుకే ఫేక్ వార్తలను ఖండించాల్సి వచ్చింది. దయచేసి మీ సో కాల్డ్ సోర్స్‌లను మరోసారి చెక్ చేసుకోండి. దయచేసి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు' అని పంత్ రిప్లై ఇచ్చాడు.
కాగా, 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పంత్ అప్పట్నుంచి దిల్లీ క్యాపిటల్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 111 మ్యాచ్‌ల్లో 3284 పరుగులతో రాణించాడు. అయితే 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా 2023 సీజన్లో పంత్ ఐపీఎల్ ఆడలేదు. ఇక మళ్లీ 2024లో ఐపీఎల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దిల్లీ కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు.