తెలంగాణ

telangana

ETV Bharat / sports

పిల్లాడిలా మారిపోయిన స్టార్ క్రికెటర్ - రోడ్డుపై గోళీలు ఆడిన పంత్

Rishabh Pant Playing Marbles : ఐపీఎల్​ కోసం రెడీ అవుతున్న స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్​ తాజాగా చిన్నారులతో గోళీలు ఆడుతూ సందడి చేశాడు. వాళ్లలో ఒకడిగా మారిపోయి సీరియస్​గా ఆడుతూ కనిపించాడు. ఆ విశేషాలు మీ కోసం

Rishabh Pant Playing Marbles
Rishabh Pant Playing Marbles

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 9:18 AM IST

Updated : Mar 4, 2024, 12:49 PM IST

Rishabh Pant Playing Marbles : ఘోర రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఎన్​సీఐలో విశ్రాంతి తీసుకుంటూ తదుపరి మ్యాచ్​ల కోసం సిద్ధమవుతున్నాడు. ఇక రానున్న ఐపీఎల్​లో మరోసారి తన మెరుపులు మెరిపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. క్రికెట్​కు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్​తో టచ్​లో ఉన్నాడు. అయితే తాజాగా రిషబ్​ చేసిన ఓ పని నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఓ రోడ్డు పక్కన చిన్నపిల్లలతో కలిసి పంత్​ గోళీల ఆట ఆడుతూ కనిపించాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ముఖానికి కర్చీఫ్, తలకు క్యాప్ పెట్టుకున్నాడు. వాళ్లలో తాను ఓ పిల్లాడిలాగా కలిసిపోయి సీరియస్‍గా ఆటలో నిమగ్నమైపోయాడు. సరదాగా ఆడుతూ ఆ చిన్నారులతో ముచ్చటించాడు. ఇక ఆ వీడియోను పంత్​ తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. స్టార్ అయ్యి ఇంత డౌన్​ టు ఎర్త్​ గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో పంత్​ తను చిన్నానాటి రోజులను గుర్తుచేసుకున్నాడేమో అంటూ సరదాగా అంటున్నారు. తనని చూసి వారికి కూడా పాత రోజులు గుర్తొచ్చాయంటూ అభిప్రాయపడుతున్నారు.

పంత్​ కమ్​బ్యాక్​ అప్పుడే!

Rishabh Pant Comeback:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్​లోకి రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అతడు 2024 ఐపీఎల్​లో దిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్​ తర్వాత కోలుకుంటున్న రిషభ్​కు,​ ఎన్​సీఏ (National Cricket Academy) మార్చి 5న క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ దిల్లీ క్యాపిటల్స్​ క్యాంప్​లో చేరనున్నాడు. అయితే ఈ విషయంపై జట్టు మెంటార్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.

'పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ, ఇప్పటికీ టోర్నీలో పంత్ కొన్ని మ్యాచ్​లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మార్చి 5న ఎన్​సీఏ పంత్​కు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అతడి కెప్టెన్సీ విషయం గురించి ఆలోచిస్తాం. పంత్​కు క్రికెట్​లో లాంగ్ కెరీర్​ ఉంది. అందుకే మేం అతడి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడే అతడిపై పనిభారం పెట్టలేం. ఎన్​సీఏ నుంచి రిలీజ్ అయ్యాక, అతడు దిల్లీ క్యాంప్​లో చేరతాడు. అప్పుడు పంత్ కమ్​బ్యాక్, వికెట్ కీపింగ్ గురించి​ అతడితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాం. అతడు ఐపీఎల్​ నాటికి ఫిట్​గా లేకపోతే మాకు రికీ భుయ్, షయ్ హోప్, స్టబ్స్ వికెట్ కీపింగ్​ కోసం​ ఉన్నారు' అని గంగూలీ అన్నాడు.

ఫుల్ కాన్ఫిడెంట్​గా పంత్- 2024 IPL లో బరిలోకి దిగడం పక్కా!

ధోనీ లాస్ట్ సీజన్!, పంత్ కమ్​బ్యాక్- 2024 IPL మరింత ఆసక్తికరంగా

Last Updated : Mar 4, 2024, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details