Rishabh Pant 90s In Test :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే పంత్, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ, 99 వ్యక్తిగత పరుగుల వద్ద పంత్ ఓ రూర్కీ బౌలింగ్‌లో క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. పంత్ ఔట్ అవ్వడం వల్ల ఒక్కసారిగా టీమ్ఇండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు.
అయితే టెస్టు క్రికెట్లో 90'ల్లో పెవిలియన్ చేరడం పంత్‌కు ఇది తొలిసారి కాదు. 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్, ఇప్పటివరకు 62 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఇందులో 90ల్లో ఔట్ అవ్వడం పంత్‌కు ఇది ఏడోసారి. పంత్ ఇప్పటివరకు 93, 97, 96, 92, 92, 91, 99 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక సార్లు 90ల్లో ఔటైన భారత ఆటగాళ్లలో మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజం సచిన్ తెందూల్కర్ అందరికంటే ఎక్కువగా 10సార్లు 90ల్లో పెవిలియన్ చేరాడు.
టెస్టుల్లో 90ల్లో అత్యధికసార్లు ఔటైన టీమ్ఇండియా ప్లేయర్లు
సచిన్ తెందూల్కర్ | 10 |
రాహుల్ ద్రవిడ్ | 09 |
రిషభ్ పంత్ | 07 |
సునీల్ గావస్కర్ | 05 |
ఎమ్ ఎస్ ధోనీ | 05 |
వీరేంద్ర సెహ్వాగ్ | 05 |
రెండో బ్యాటర్‌గానూ
అయితే పంత్ ఈ మ్యాచ్‌తో 99 పరుగుల వద్ద ఔటైన టీమ్ఇండియా రెండో వికెట్ కీపర్‌గానూ నిలిచాడు. పంత్ కంటే ముందు మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ 99 పరుగుల ఔటై, పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో సింగిల్ రన్‌తో సెంచరీ చేజార్చుకున్న నాలుగో వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.