తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ బ్యాట్​ వల్ల నా ఇమేజ్ దెబ్బతింది - ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను' - RINKU SINGH VIRAT BAT

విరాట్ కోహ్లీని బ్యాట్ అడగడం వల్ల తన ఇమేజ్ దెబ్బతిందని చెప్పిన యంగ్ బ్యాటర్ రింకూ సింగ్!

source Associated Press
Rinku Singh Virat Kohli (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 11, 2024, 8:01 PM IST

Rinku Singh Virat Kohli Bat Incident : టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ తనదైన హిట్టింగ్​తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఇటీవలే బంగ్లాతో జరిగిన రెండో టీ20లోనూ అది నిరూపితమైంది. 29 బంతుల్లోనే రింకూ 53 పరుగులు బాదాడు. అందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింకూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'నా ఇమేజ్ దెబ్బతింది' -మీరు విరాట్ కోహ్లీని కొన్నాళ్ల క్రితం బ్యాట్ అడిగారు కదా? అలానే ఇప్పుడు మీ బ్యాట్​ను ఎవరైనా అడిగారా? అని రింకూను రిపోర్టర్ ప్రశ్నించారు. అందుకు రింకూ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. "బ్యాట్ కారణంగా నా ఇమేజ్ పాడైపోయింది! అందరూ నన్ను చూసి ఎప్పుడూ బ్యాట్​లు అడుగుతూనే ఉంటాడనుకుంటున్నారు. కానీ నేను ఇప్పుడు ఆ సమస్యను అధిగమించాను. ఇకపై ఎవర్నీ బ్యాట్ ఆడగను. అలా బ్యాట్ అడగడం వల్ల నా ఇమేజ్ దెబ్బతింది. " అని రింకూ వ్యాఖ్యానించాడు. కాగా, గతంలో రింకూ సింగ్ - కోహ్లీ, నితీశ్ రాణా బ్యాట్​లతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

'ఆ విషయం సూర్యకు తెలుసు' -టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్య మిమ్మల్ని బౌలర్ కూడా ఉపయోగించొచ్చు కదా ? అని రింకూని అడగ్గా ఇలా బదులిచ్చాడు. "అవును. నేను ఏడు మ్యాచుల్లో మూడు వికెట్లు తీశానని, శ్రీలంక సిరీస్​లో కూడా బౌలింగ్ చేశానని సూర్యకు గుర్తు చేశాను. ఆయనకు ఆ విషయం తెలుసు. వికెట్ టర్నింగ్ పరిస్థితి వస్తే నాకు అతడు బంతి ఇస్తాడు." అని రింకూ పేర్కొన్నాడు.

"నేనెప్పుడూ 3 లేదా 4వికెట్లు పడిన తర్వాత బ్యాటింగ్​కు వస్తాను. కాబట్టి ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అందుకు మ్యాచ్​కు అనుగుణంగా బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బంగ్లాతో రెండో టీ20లో నేను పెద్ద స్కోర్ చేయడానికి ప్లాన్ చేయలేదు. సింగిల్స్, డబుల్స్ తీసి స్కోరును పెంచాలని భావించాం. ఆ తర్వాత వేగంగా పరుగులు చేశాం. మ్యాచ్​కు ముందు టీమ్ ఇండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్​తో ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదు. కేకేఆర్​కు ఆడేటప్పుడు నా శైలిలో ఆడడానికి గంభీర్ స్వేచ్ఛను ఇచ్చాడు. ఇప్పుడే అదే మాట చెప్పాడు."

- రింకూ సింగ్, టీమ్ ఇండియా బ్యాటర్

టీమ్ ఇండియా ఘన విజయం - బంగ్లాదేశ్​తో ఇటీవల జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 41పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ సింగ్, మరో యంగ్ బ్యాటర్ నితీశ్ తో కలిసి 108 భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు 221 పరుగుల భారీ స్కోరును అందిచాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ను కూడా 2-0 తేడాతో గెలుచుకుంది. మూడో టీ20 హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది.

రోహిత్​కు అది దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమతి : ధోనీ

WTC టేబుల్​లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details